Reset UPI Pin : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) పేమెంట్స్ మన దేశంలో గణనీయంగా పెరిగిపోయాయి. నగదు బదిలీ కోసం బ్యాంకుకు వెళ్లడం కంటే యూపీఐ పేమెంట్స్ చేయడమే ఈజీ అని ప్రజలు భావిస్తున్నారు. అంతలా యూపీఐ టెక్నాలజీ డిజిటల్ బ్యాంకింగ్ విప్లవాన్ని క్రియేట్ చేసింది. అయితే ఈ సౌలభ్యం వెనుక కొంత రిస్క్ కూడా దాగి ఉంది. హ్యాకర్ల ముప్పు సైతం ఉంది. దాన్ని అధిగమించాలంటే.. మనం తరుచుగా యూపీఐ పిన్‌ను మారుస్తూ ఉండాలి. యూపీఐ పిన్‌ను(Reset UPI Pin) ఎలా మార్చాలి ? అనేది మనం తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
యూపీఐ పిన్‌ను మార్చడానికి ముందు మన డెబిట్ కార్డులోని చివరి ఆరు అంకెలను, కార్డుపై ఉండే గడువు తేదీ వివరాలను సిద్ధం చేసుకోవాలి. మన ఫోన్ నంబరు, బ్యాంకు అకౌంటుతో లింక్ అయి ఉండాలి. ఇవన్నీ సరిగ్గా ఉంటేనే యూపీఐ పిన్‌ను మార్చగలుగుతాం. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ఇలా ఏదైనా యూపీఐ యాప్‌ను తెరిచి.. అందులోని మెనూ నుంచి ‘‘బ్యాంక్ అకౌంట్’’ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి. ఆ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయగానే.. “UPI PINని రీసెట్ చేయి” అనే మరో ఆప్షన్ వస్తుంది. దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోగానే.. కొత్త UPI పిన్‌ని క్రియేట్ చేసే ప్రాసెస్ మొదలవుతుంది.
Also Read :Swimmer Rescued : బీచులో మునిగింది.. 80 కి.మీ దూరంలో ప్రాణాలతో తేలింది
ఈక్రమంలో మన డెబిట్ కార్డుకు సంబంధించిన చివరి ఆరు అంకెలను, డెబిట్ కార్డ్ గడువు ముగింపు తేదీని అక్కడున్న ఖాళీలలో నింపాలి. ఆ వెంటనే యూపీఐ యాప్ ఆటోమేటిక్‌గా మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను గుర్తించే ప్రక్రియను మొదలు పెడుతుంది. ఈక్రమంలో బ్యాంకు సర్వర్ నుంచి మన ఫోనుకు ఓటీపీ వస్తుంది. ఆటోమేటిక్‌గా ఆ ఓటీపీని యూపీఐ యాప్ రీడ్ చేస్తుంది. చివరి స్టెప్‌లో మనం కొత్త యూపీఐ పిన్‌ను ఎంటర్ చేయాలి.. రెండోసారి కూడా కొత్త యూపీఐ పిన్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంతో కొత్త యూపీఐ పిన్(UPI Payments) నిర్ధారణ అవుతుంది.