Thangedu Flowers : తంగేడు పూలు, ఆకులు, బెరడు, వేర్లలో ఔషధ గుణాలివీ

Thangedu Flowers : ‘తంగేడు పువ్వప్పునే గౌరమ్మ.. తంగేడు కాయప్పునే..’ అంటూ బతుకమ్మ పాట పాడతారు.

  • Written By:
  • Updated On - October 4, 2023 / 09:04 AM IST

Thangedu Flowers : ‘తంగేడు పువ్వప్పునే గౌరమ్మ.. తంగేడు కాయప్పునే..’ అంటూ బతుకమ్మ పాట పాడతారు. ఈ పాటను బట్టి  బతుకమ్మను పేర్చడంలో తంగేడు పూలకు ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. ఎన్ని రకాల పూలున్నా తంగేడు లేకుంటే బతుకమ్మను పేర్చడం పూర్తికానట్టే అని భావిస్తారు. ఒక్క తంగేడు పూవైనా బతుకమ్మలో ఉండాల్సిందే. అంతేకాదు .. ‘తంగేడు’ తెలంగాణ రాష్ట్ర పుష్పం కూడా. ఈ పువ్వు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

తంగేడు ఆరోగ్య ప్రయోజనాలు.. 

  • తంగేడు మొక్కను ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తారు. దీని  ఆకులు, పువ్వులు, బెరడు వేర్లతో తయారు చేసుకునే కషాయాలు ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయి.
  • తంగేడు పూల కషాయం మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందని అంటారు.
  • తంగేడు పూల పొడిని శనగపిండి లేదా ముల్తానీ మట్టితో  కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రపరచుకుంటే చర్మం నిగారింపు పెరుగుతుంది.
  • తంగేడు ఆకులను మజ్జిగతో కలిపి పేస్ట్ చేసుకొని పాదాల పగుళ్లకు అప్లై చేసుకుంటే పాదాల పగుళ్ల నొప్పి తగ్గుతుంది. పాదాలకు పగుళ్లు కూడా రావు.
  • తంగేడు పూల పేస్ట్ ను ఎండబెట్టి కొబ్బరి నూనెలో వేసి మరిగించాలి. ఆ నూనెను వాడితే చుండ్రు సమస్య మాయమవుతుంది. జుట్టు రాలే సమస్య కూడా పోతుంది.
  • తంగేడు ఆకుల పొడిని ఒక గ్లాసు గోరువెచ్చటి నీటితో కలిపి ఉదయాన్నే తాగితే మలవిసర్జన సాఫీగా జరుగుతుంది.
  • తంగేడు పూల పొడిని బెల్లంతో కలిపి ప్రతిరోజు సగం స్పూన్ చొప్పున  తీసుకుంటే అతిమూత్ర సమస్య పరిష్కారం అవుతుంది.
  • రెండు గ్లాసుల నీళ్లలో తంగేడు చెట్టు వేర్లను (Thangedu Flowers) వేసి బాగా మరిగాక.. వడకట్టుకుని గోరువెచ్చగా ఉండగా తాగాలి. ఇది నీళ్ల విరేచనాలను తగ్గిస్తుంది.

Also read : Anjeer Water: ఉదయాన్నే అంజీర్ నీరు తాగితే ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!

​​గమనిక: ఈ వార్తలోని వివరాలను ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం, విశ్లేషణ,  మీడియా నివేదికల ప్రకారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. మీ నిర్ణయానికి పూర్తి బాధ్యత మీదే.