Site icon HashtagU Telugu

Gold VS Diamond : బంగారం వర్సెస్ వజ్రాలు.. ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఏది బెటర్ ?

Gold Vs Diamond Investment

Gold VS Diamond : చేతినిండా డబ్బున్న వాళ్లు దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా అని తెగ ఆలోచిస్తుంటారు. ఎంతోమందిని దీనిపై సలహాలు అడుగుతుంటారు. చాలామంది నిపుణులు చెప్పే విషయం ఏమిటంటే.. మన పెట్టుబడులన్నీ ఒకేచోట పెట్టకూడదు. వాటిని డైవర్సిఫైడ్ వివిధ చోట్ల పెట్టాలి. తద్వారా భవిష్యత్తులో ఏదైనా రంగంలో అస్థిరత ఏర్పడినా, మిగతా రంగాల్లోని మన పెట్టుబడులు మంచి లాభాలను సంపాదించి పెట్టే ఛాన్స్ ఉంటుంది.  లాంగ్ టర్మ్ ఫోకస్‌తో చాలామంది బంగారం, వజ్రాలలో పెట్టుబడులు పెడుతుంటారు. ఈ రెండింటిలో పెట్టుబడి పెట్టడానికి ఏది బెటర్ అనేది ఈ కథనంలో చూద్దాం.

Also Read :Space Tour Tickets : స్పేస్ టూర్.. ఒక టికెట్ రూ.1.77 కోట్లు మాత్రమే

బంగారం

  • ఇతర దేశాల ప్రజల సంగతి అలా ఉంచితే, మన దేశ ప్రజలకు మాత్రం బంగారంతో(Gold VS Diamond) సెంటిమెంటల్ అటాచ్‌మెంట్ ఉంటుంది.
  • పెళ్లిళ్లు జరిగాయంటే కట్నంలో గోల్డ్ ఇవ్వడం అనేది మనదేశంలో సంప్రదాయంగా వస్తోంది. అందుకే ఏటా పెళ్లిళ్ల సీజన్‌లో గోల్డ్స్ సేల్స్ అమాంతం పెరిగిపోతుంటాయి.
  • బంగారం.. కష్టకాలంలో ఆదుకుంటుందని భారతీయులు నమ్ముతారు. అందుకోసమే దాన్ని కొని పెట్టుకుంటారు. డబ్బులు అవసరమైనప్పుడు బంగారాన్ని తనఖా పెట్టి లేదా విక్రయించి అవసరాలను తీర్చుకుంటారు.
  • బంగారాన్ని కొనడం, అమ్మడం చాలా ఈజీ ప్రక్రియ.
  • బంగారం క్రయవిక్రయాలకు స్థిరమైన మార్కెట్ ఉంది.
  • బంగారం ధరలు దీర్ఘకాలంలో భారీగా పెరుగుతాయే తప్ప.. స్వల్ప కాలంలో భారీగా పెరగవు, భారీగా తగ్గవు.  దీనివల్ల మన పెట్టుబడికి నష్టం వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
  • ఫిజికల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్​లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు, సావరిన్ గోల్డ్ బాండ్లు వంటి వివిధ పెట్టుబడి సాధనాల ద్వారా మనం బంగారంలో పెట్టుబడి పెట్టొచ్చు.

వజ్రాలు

  • వజ్రాలు.. లగ్జరీకి సంబంధించినవి. సామాన్యులు, మధ్యతరగతి వారు వీటిని కొనరు.
  • వజ్రాల ధర అనేది వాటి క్యారెట్, కట్, ప్యూరిటీ, కలర్ ఆధారంగా డిసైడ్ అవుతుంది.
  • వజ్రాల ధరలు బాగా హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ద్రవ్యోల్బణం బాగా ఉన్న టైంలో డైమండ్లలో పెట్టుబడులు అంత సేఫ్ కాదు.
  • వజ్రాల ధర అనేది ఫ్యాషన్, పరిశ్రమ పరిస్థితులు, వినియోగదారుల డిమాండ్ వంటి అంశాలను బట్టి కూడా మారుతుంటుంది.
  • వజ్రాల పరిశ్రమలో కొనుగోలుదారుడు, విక్రేత మధ్య మధ్యవర్తులు ఉంటారు. అందుకే డైమండ్లను కొనడం సవాల్​తో కూడుకున్న పని.
  • ఫిజికల్ డైమండ్స్, డైమండ్ ఫండ్స్​ ద్వారా కూడా వజ్రాలలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు.
  • పైన మనం చెప్పుకున్న అంశాలన్నీ తెలుసుకున్న తర్వాతే వజ్రాలలో పెట్టుబడి పెట్టాలి.