Site icon HashtagU Telugu

Gold Types : 18కే, 22కే, 24కే బంగారం రకాల్లో తేడా ఏమిటి ? క్యారట్ల వ్యాల్యూ ఎంత ?

Gold Types 916 Gold Jewelry

Gold Types : బంగారంలో రకరకాల క్యారట్‌లు ఉంటాయి.  18కే, 20కే, 22కే, 24కే .. ఇందులోని కే అంటే క్యారట్. క్యారట్ అనేది బంగారం ప్యూరిటీకి కొలమానం. ఇంతకీ వీటి మధ్య తేడా ఏమిటి ? 916 గోల్డ్ ఆభరణాలు అంటే ఏమిటి ? అనేది మనం ఈ కథనంలో తెలుసుకుందాం..

  • క్యారట్ నంబర్ ఎంత పెరిగితే బంగారం ప్యూరిటీ అంతగా పెరిగినట్టు. 24 క్యారట్ బంగారం 100 శాతం ప్యూర్.
  • క్యారట్ నంబర్ ఎంతగా తగ్గితే బంగారం ప్యూరిటీ(Gold Types) అంతగా తగ్గుతుంది. అంటే.. అందులో ఇతర లోహలు కలిశాయన్న మాట.
  • బంగారంలో ఇతర లోహాలను కలపడానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే.. 24 క్యారట్ల ప్యూర్ గోల్డ్‌తో ఆభరణాలు తయారు చేయలేం. ఇతర లోహాలు కలిపితే ఆభరణాల తయారీకి అనువుగా బంగారం మోల్డ్ అవుతుంది.
  • 24 క్యారట్ల బంగారంలో మెత్తదనం ఎక్కువ. దీనితో నాణేలు, గోల్డ్ బార్స్, కొన్ని రకాల పరికరాలను తయారు చేస్తుంటారు.
  • 22 క్యారట్ల బంగారం ప్యూరిటీ 91.67 శాతం. దీనితో బంగారు ఆభరణాలు తయారు చేస్తారు. దీని ప్యూరిటీ నంబర్ (91.67 శాతం)లోని తొలి మూడు అంకెల ఆధారంగా ‘916 గోల్డ్ ఆభరణాలు’ అనే పదం వచ్చింది. అంటే 22 క్యారట్ల బంగారంతో చేసే జ్యువెల్లరీని 916 గోల్డ్ ఆభరణాలు అని పిలుస్తారు. ఈ బంగారంలో 8 శాతంమేర సిల్వర్, జింక్, నికెల్ వంటి మెటల్స్ కలుపుతారు. క్యారట్లు తగ్గినందు వల్ల దీని ధర కూడా తగ్గుతుంది.
  • 18 క్యారట్ల బంగారంలో 75 శాతం గోల్డ్, 25 శాతం సిల్వర్, కాపర్ లాంటి మెటల్స్ ఉంటాయి. విలువైన రత్నాలు, రాళ్లు, వజ్రాలు పొదిగిన ఆభరణాల తయారీకి ఈ రకం బంగారం అనువైనది. దీని ధర తక్కువే. ఇది రోజువారీ వినియోగానికి బెస్ట్ ఆప్షన్. ఉంగరాలు, వాచీలను ఇలాంటి రకం గోల్డ్‌తోనే తయారు చేస్తుంటారు.
  • 10 క్యారెట్లు, 14 క్యారెట్ల గోల్డ్ సైతం ఉంటుంది. అయితే వాటి ప్యూరిటీ చాలా తక్కువ.
  • హాల్ మార్క్ లేని ఆభరణాలను కొనకూడదు.