Hema : బెంగళూరు రేవ్ పార్టీపై స్పందించిన నటి హేమ

  • Written By:
  • Publish Date - May 20, 2024 / 12:47 PM IST

Bangalore Rave Party: సినీ నటి హేమ(Actress Hema) బెంగళూరు రేవ్‌ పార్టీపై వివరణ ఇచ్చారు. ఆ పార్టీతో తాను కూడా ఉన్నట్లు కన్నడ మీడియా వార్తలు ప్రసారం చేయడాన్ని హేమ ఖండించారు. అవన్నీ ఫేక్‌ వార్తలని అంటూ కొట్టిపారేశారు. అయితే తాను ఎక్కడికీ వెళ్లలేదని, హైదరాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో చిల్‌ అవుతున్నానని చెప్పారు. ఆ పార్టీలో ఎవరు ఉన్నారో తనకు తెలియదని చెప్పారు. ఈమేరకు సోషల్ మీడియాలో హేమ ఓ వీడియోను రిలీజ్ చేశారు. తనపై వస్తున్న తప్పుడు వార్తలు నమ్మొద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

కాగా, బెంగుళూరు శివారులో ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్‌ హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతోందనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడులలో దాదాపు వందమందికి పైగా పట్టుబడ్డారని, అందులో తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారని సమాచారం. ఇందులో నటి హేమ కూడా ఉందంటూ కన్నడ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దీంతో తనకు ఆ పార్టీతో ఎలాంటి సంబంధంలేదని ఈ మేరకు నటి హేమ వివరణ ఇస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ జరుగుతున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అక్కడికి చేరుకొని దాడి చేశారు. ఏపీ, బెంగళూరుకు చెందిన దాదాపు 100 మందికిపైగా పార్టీకి హాజరయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో పలు రకాల డ్రగ్స్‌ వాడినట్లు గుర్తించి సీజ్‌ చేశారు. 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్‌, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫామ్‌ హౌస్‌ సమీపంలో బెంజ్‌, జాగ్వార్‌, ఆడీ సహా ఖరీదైన 15 కార్లను జప్తు చేశారు. రేవ్‌ పార్టీలో ఏపీకి చెందిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరుతో పాస్‌ ఉన్న బెంజ్‌ కారు సైతం లభ్యమైనట్లు సమాచారం. పార్టీ జరిగిన ఫామ్‌హౌస్‌ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Tabu : పవర్ స్టార్ ఛాన్స్ వదులుకున్న టబు.. ఆమె ప్లేస్ లో ఎవరంటే..?