Father’s Day : ఫాదర్స్ డే రోజు మీ తండ్రికి ఈ గాడ్జెట్స్ బహుమతిగా ఇచ్చి సర్ ప్రైజ్ చేయండి..!!!

ఈ ఫాదర్స్ డే రోజున మీరు కూడా మీ నాన్నకి ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా అయితే ఇది మీకోసం. మీరు మీ తండ్రికి బహుమతిగా ఇవ్వగల కొన్ని గాడ్జెట్‌ల గురించి మేము మీకు సలహాలను ఇస్తున్నాం.

  • Written By:
  • Publish Date - June 19, 2022 / 12:10 PM IST

ఈ ఫాదర్స్ డే రోజున మీరు కూడా మీ నాన్నకి ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా అయితే ఇది మీకోసం. మీరు మీ తండ్రికి బహుమతిగా ఇవ్వగల కొన్ని గాడ్జెట్‌ల గురించి మేము మీకు సలహాలను ఇస్తున్నాం. మార్కెట్ చాలా అధునాతన ఫీచర్‌లతో నిండిన గాడ్జెట్స్ ఉన్నప్పటికీ, మీ తండ్రికి సంతోషాన్ని కలిగించే వాటిని ఎంచుకోవాలని మీరు కోరుకుంటారు. కాబట్టి ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఏ స్మార్ట్ గాడ్జెట్‌ గిఫ్ట్ గా ఇస్తే బాగుంటుందో తెలుసుకుందాం.

స్మార్ట్ వాచ్..
ఈ రోజుల్లో స్మార్ట్‌వాచ్ ట్రెండింగ్ లో ఉంది. మీరు కావాలంటే, మీరు మీ తండ్రికి స్మార్ట్ వాచ్ బహుమతిగా ఇవ్వవచ్చు. స్మార్ట్ వాచ్ లోని స్మార్ట్ ఫీచర్లు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాయి. స్మార్ట్ వాచ్‌లో, యూజర్ స్ట్రెస్ మానిటర్, హార్ట్, స్లీప్ మానిటర్, వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కాబట్టి ఈసారి మీరు మీ తండ్రి ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే మంచి బహుమతిగా స్మార్ట్ వాచ్ మారుతుంది.

ట్రిమ్మర్…
ట్రిమ్మర్ అనేది ప్రతి మనిషికి అవసరం. కావాలంటే బజారులో మంచి ట్రిమ్మర్ కొని మీ తండ్రికి ఇవ్వొచ్చు. ఈ రోజుల్లో, మార్కెట్లో స్మార్ట్ లుక్ కోసం ఛార్జింగ్‌తో కూడిన ట్రిమ్మర్లు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే, అవి 60 నిమిషాల పాటు సులభంగా పని చేయగలవు.

స్మార్ట్ స్పీకర్..
మీరు మీ తండ్రికి మంచి హోమ్ స్మార్ట్ స్పీకర్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. మీరు Google Home స్మార్ట్ స్పీకర్‌ను బహుమతిగా ఇస్తే, Google Assistant వారి జీవితాన్ని మునుపటి కంటే సులభతరం చేస్తుంది. గూగుల్ స్మార్ట్ స్పీకర్ వార్తలు చదువుతుంది. వారికి ఇష్టమైన పాటలను ప్లే చేస్తుంది.