Elections 2024 : గాలి మోటార్లకు డిమాండ్.. ఎన్నికల ఎఫెక్టు.. రేట్లు ఇవీ

Elections 2024 :  దేశంలో ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభతో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీల‌కు సైతం పోల్స్ జ‌ర‌గ‌నున్నాయి.

  • Written By:
  • Publish Date - March 18, 2024 / 10:24 AM IST

Elections 2024 :  దేశంలో ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభతో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీల‌కు సైతం పోల్స్ జ‌ర‌గ‌నున్నాయి. ఏడు ద‌శ‌ల్లో జ‌ర‌గ‌నున్న ఈ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు  విస్తృత స్థాయిలో ప్ర‌చారానికి శ్రీకారం చుట్టాయి. ఎన్నికల షెడ్యూల్‌కు.. పోలింగ్‌కు మ‌ధ్య గ్యాప్ ఈసారి ఎక్కువ‌గా ఉంది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో  రాజ‌కీయ పార్టీలు నిమగ్నమయ్యాయి.  ప్ర‌ధాన పార్టీల అధినేత‌లు దేశవ్యాప్తంగా పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చాలా పార్టీల నాయ‌కులు హెలికాప్ట‌ర్ల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. కొన్ని జాతీయ పార్టీలైతే కీల‌క నేత‌ల పర్యటనల కోసం ప్రైవేటు విమానాల‌ను వాడుకోనున్నాయి. చిత్రం ఏమిటంటే.. అభ్య‌ర్థుల ప్ర‌యాణ ఖ‌ర్చు ఎన్నిక‌ల ఖ‌ర్చులోకి(Elections 2024) రాదు. కేవ‌లం ప్ర‌చార ఖ‌ర్చు అంటే.. జెండాలు, ఇత‌ర‌త్రా ప్ర‌చారానికి చేసిన ఖ‌ర్చునే ఎన్నిక‌ల సంఘం ప‌రిగ‌ణిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join

ప్రాంతీయ పార్టీల ప్రయారిటీ ఇదీ.. 

చార్టర్డ్‌ విమానాలు, హెలికాప్టర్ల బుకింగ్ కోసం రాజకీయ పార్టీల నుంచి డిమాండ్ వెల్లువెత్తుతోంది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి వీటికి డిమాండ్‌ 50 శాతం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.విమానాలతో పోలిస్తే హెలికాప్టర్లకే ఎక్కువ‌ డిమాండ్‌ ఉంటుందని చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీలైతే హెలికాప్ట‌ర్ల‌ వైపే మొగ్గు చూపుతున్నాయి. తక్కువ సమయంలో మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లగలిగే సౌలభ్యం ఉన్నందున అవే బెస్ట్ అని భావిస్తున్నాయి. విమానాలు, హెలికాప్ట‌ర్ల‌ను సంబంధిత సంస్థ‌ల నుంచి రాజకీయ పార్టీలు రోజులు, వారాల ప్రాతిప‌దిక‌న అద్దెకు తీసుకునేందుకు సంబంధించిన డీల్స్ కుదురుతున్నట్లు సమాచారం.

Also Read : Tirumala : తిరుమ‌లకు వెళ్లేవారికి గ‌మ‌నిక.. నేటి నుంచే ఆ టికెట్ల రిజిస్ట్రేష‌న్‌

అద్దెలు ఇలా..

  • సాధార‌ణంగానైతే  విమానాలు, హెలికాప్టర్లకు గంట చొప్పున అద్దెను వసూలు చేస్తారు.
  • చార్టర్డ్‌ విమానాలకు గంటకు  రూ.4 ల‌క్ష‌ల నుంచి  రూ.5 ల‌క్ష‌ల దాకా అద్దెను తీసుకుంటారు.
  • ఎన్నిక‌ల‌కు కొన్ని రోజుల ముందు వరకు ఈ రేట్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
  • హెలికాప్టర్లకు గంటకు రూ.1.60 లక్షల వ‌ర‌కు ప్ర‌స్తుతం వ‌సూలు చేస్తున్నారు.ఇది రాబోయే రోజుల్లో రూ.3 ల‌క్ష‌లకు పెరిగినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు.
  • అధికారిక లెక్కల ప్రకారం.. 2023  డిసెంబరు నాటికి దేశంలో 112 నాన్‌ షెడ్యూల్డ్‌ ఆపరేటర్స్  ఉన్నారు. వీరిలో 40-50 శాతం ఆపరేటర్లు ఒక్క విమానమే నడుపుతున్నారు. వీరికి విమానాలు, హెలికాప్టర్లు కలిపి మొత్తం 450 వరకు ఉంటాయి.
  • ఈ ఆపరేటర్ల దగ్గర ఫాల్కన్‌ 2000, బాంబార్డియర్‌ గ్లోబల్‌ 5000, ట్విన్‌ అట్టర్‌ డీహెచ్‌సీ-6-300, హాకర్‌ బీచ్‌క్ర‌ప్ఠ్‌, గల్ఫ్‌స్ట్రీమ్‌ జీ-200, సెస్నా సైటేషన్‌ 560 ఎక్స్‌ఎల్‌, తదితర విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయి.
  • 2019-20 సంవత్సరానికిగానూ విమానం, హెలికాప్టర్ల ప్రయాణాలకు బీజేపీ రూ.250 కోట్లు వెచ్చించింది.
  • ఇదేసమయంలో కాంగ్రెస్‌ పార్టీ  రూ.126 కోట్లు విమానాలు, హెలికాప్ట‌ర్ల‌కు ఖ‌ర్చు చేసింది.

Also Read : Putin Win : మరోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్.. నాటోకు ‘వరల్డ్ వార్‌‌’ వార్నింగ్

  • వైఎస్సార్ సీపీ, టీడీపీ, జ‌న‌సేన‌లు ఈసారి ప్రచారానికి హెలికాప్ట‌ర్లు వినియోగించ‌నున్నాయి.
  • వైఎస్సార్ సీపీ ఇప్ప‌టికే రెండు హెలికాప్ట‌ర్ల‌కు అడ్వాన్స్‌లు ఇచ్చి రిజ‌ర్వ్ చేసుకుంది.
  • టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు వేర్వేరుగా ఒక్కొక్క‌టి చొప్పున హెలికాప్ట‌ర్ల‌ను వినియోగించ‌నున్నారు.