Prime Minister: ఏ ఆర్టిక‌ల్ ప్ర‌కారం ప్ర‌ధానమంత్రిని నియ‌మిస్తారో తెలుసా..?

  • Written By:
  • Publish Date - June 8, 2024 / 06:15 AM IST

Prime Minister: నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి దేశానికి ప్రధానమంత్రి (Prime Minister) కాబోతున్నారు. దీంతో స్టాక్‌ మార్కెట్‌లో రోజురోజుకూ విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది. ప్రధాని మోదీ విజయంతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా భారీగా లబ్ధి పొందుతున్నారు. స్టాక్ మార్కెట్ బూమ్ కారణంగా.. అతని పోర్ట్‌ఫోలియో కూడా పెరుగుతోంది. రాహుల్ గాంధీ స్టాక్ పోర్ట్‌ఫోలియో దాదాపు 3.5 శాతం పెరిగింది.

భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని ఎన్‌డిఎకి చెందిన కొత్తగా ఎన్నికైన ఎంపిలు శుక్రవారం (జూన్ 7) సమావేశమయ్యారు. దీనిలో వారు నరేంద్ర మోడీని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆయన వరుసగా మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమం చేసారు. ఇదిలా ఉండగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్డీయే అధినేత నరేంద్ర మోదీని ప్రధానిగా నియమించారు.

ప్రమాణ స్వీకారం చేసే తేదీ, సమయం

వార్తా సంస్థ ANI నివేదిక ప్రకారం.. 09 జూన్ 2024న సాయంత్రం 07:15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రి మండలి సభ్యులతో పదవీ ప్రమాణం, గోప్యత ప్రమాణం చేయిస్తారు. ఎన్‌డిఎ నాయకుల నుండి మద్దతు లేఖలు అందుకున్న తరువాత 18వ లోక్‌సభలో ఎన్‌డిఎకు మెజారిటీ వచ్చే పరిస్థితి ఉందని రాష్ట్రపతి గుర్తించారు. ఆ తర్వాత భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 75(1) ప్రకారం రాష్ట్రపతి.. నరేంద్ర మోదీని భారత ప్రధానిగా నియమించారు.

Also Read: Prashant Kishor: పీకే సంచలన నిర్ణయం.. ఇక ప్రిడిక్షన్ ఉండదు

కేంద్ర మంత్రి మండలి సభ్యుల జాబితాను కోరారు

రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రమాణ స్వీకారోత్సవం తేదీ, సమయాన్ని తెలియజేయాలని రాష్ట్రపతి నరేంద్ర మోదీని అభ్యర్థించారు. అలాగే కేంద్ర మంత్రి మండలిలో సభ్యులుగా నియమించాల్సిన ఇతర నేతల పేర్ల జాబితాను కూడా ఆమె కోరారు.

We’re now on WhatsApp : Click to Join

నరేంద్ర మోదీ రాష్ట్రపతికి మద్దతు లేఖను అందజేశారు

ఎన్డీయే కూటమి నాయకుడిగా ఎన్నికైన తర్వాత నరేంద్ర మోదీ సీనియర్ బీజేపీ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను వారి నివాసంలో కలిశారు. దీని తర్వాత మోదీ.. రాష్ట్రపతిని కలుసుకుని త‌న‌కు మద్దతు ఉన్న ఎంపీల జాబితాను ఆమెకు అందజేసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల‌ని కోరారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. 18వ లోక్‌సభ కొత్త శక్తి, యువశక్తి, ఏదైనా చేయాలనే సంకల్పంతో కూడిన లోక్‌సభ. స్వాతంత్య్ర అమృత మహోత్సవం తర్వాత ఇవే తొలి ఎన్నికలు. ఒకరకంగా ఇది లోక్‌సభ ప్రారంభమైన 25వ సంవత్సరం అని పేర్కొన్నారు.