Site icon HashtagU Telugu

Russian Army Shoes : రష్యా ఆర్మీ బూట్లు.. మన దేశంలోనే తయారవుతాయి తెలుసా ?

Russian Army Shoes Made In Bihar

Russian Army Shoes : ప్రపంచంలోనే సైనికశక్తిలో నంబర్ 2 దేశం రష్యా.  అణ్వాయుధాల సంఖ్య విషయంలో ప్రపంచంలోనే నంబర్ 1 దేశం రష్యా.  అంటే రష్యా దగ్గర అమెరికాను మించిన సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్నాయి. అటువంటి పవర్ ఫుల్ దేశం రష్యాకు చెందిన సైనికులు ధరించే షూస్ మన దేశంలోనే తయారవుతుంటాయి. మన దేశంలోని ఏ రాష్ట్రంలో తయారవుతాయి ? ఎలా తయారు చేస్తారు ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

హాజీపూర్. ఇది బిహార్‌లోని ఒక నగరం. హాజీపూర్‌లో ఒక పారిశ్రామిక వాడ ఉంది. ఇందులో ‘కాంపిటెన్స్ ఎక్స్‌ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే కంపెనీ 2018 సంవత్సరంలో ప్రారంభమైంది. ఈ కంపెనీలోనే రష్యా సైనికుల కోసం  షూస్ తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారయ్యే బూట్లను ధరించి రష్యాలోని వివిధ రకాల విభిన్న వాతావరణ పరిస్థితులు కలిగిన ప్రాంతాల్లో అక్కడి సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు. నిత్యం మంచుతో ఉండే సైబీరియాలాంటి ప్రాంతంలో.. మంచు పెద్దగా ఉండదని ఇతర ప్రాంతాల్లో రష్యా సైనికులు హాజీపూర్ సేఫ్టీ షూస్ ధరించి దేశం కోసం పనిచేస్తుంటారు. రష్యన్ సైన్యం అవసరాలకు అనుగుణంగా తేలికగా ఉండేలా స్లిప్ రెసిస్టెంట్ బూట్లను హాజీపూర్‌లో తయారు చేస్తుంటారు. అంటే బురద, మంచుతో నిండిన ప్రదేశాల్లోనూ ఈ షూస్ అస్సలు జారవు. ‘కాంపిటెన్స్ ఎక్స్‌ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే కంపెనీకి ఎంతోమంది కస్టమర్లు ఉన్నారు. వాళ్లందరి నుంచి నిత్యం షూస్(Russian Army Shoes) కోసం ఆర్డర్లు వస్తుంటాయి. అలాంటి కస్టమర్లలో రష్యా ఆర్మీ కూడా ఒకటి.

హాజీపూర్ సేఫ్టీ షూస్ కంపెనీ గురించి..

  • హాజీపూర్‌లో రష్యా(Russia) ఆర్మీ కోసం ‘కాంపిటెన్స్ ఎక్స్‌ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ తయారు చేసే షూస్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
  •  ఆ షూస్ మైనస్ 40 డిగ్రీల సెల్సీయస్ టెంపరేచర్‌లో కూడా సైనికుల కాళ్లకు రక్షణ కల్పిస్తాయి.
  • ఈ కంపెనీలో పనిచేసే 310 మంది ఉద్యోగుల్లో 69శాతం మంది మహిళలే.
  • గత ఏడాది వ్యవధిలో ఈ కంపెనీ నుంచి రష్యా ఆర్మీకి దాదాపు రూ. 100 కోట్లు విలువైన 15లక్షల జతల షూ‌స్ ఎగుమతి అయ్యాయి.
  • త్వరలో భారత్ మార్కెట్లోకి కూడా షూస్​ను విడుదల చేస్తామని  ‘కాంపిటెన్స్ ఎక్స్‌ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ అంటోంది.
  • యురోపియన్ మార్కెట్ అవసరాలకు తగిన లగ్జరీ డిజైనర్ ఫుట్‌ వేర్ తయారీ పై ఫోకస్ పెట్టామని కంపెనీ అంటోంది. ఇప్పటికే ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, యూకే వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపింది.
  • బెల్జియంకు చెందిన ఒక కంపెనీతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలో ఆ దేశానికి కూడా షూస్‌ను ఎగుమతి చేస్తామని చెబుతోంది.
Exit mobile version