Dhinidhi Desinghu : 14 ఏళ్ల బాలిక ధీనిధి దేశింగు ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున మెరవబోతోంది. తమిళనాడులోని చెన్నై నగరానికి చెందిన ఈ బాలిక స్విమ్మింగ్ విభాగంలో సత్తా చాటేందుకు రెడీ అయింది. దీంతో అతి పిన్న వయసులో స్విమ్మింగ్‌లో భారత్ తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారిణిగా రికార్డును ధీనిధి దేశింగు సొంతం చేసుకోబోతున్నారు. ఈమె 2009 ఆగస్టు 12న జన్మించారు. ఆరేళ్ల వయసు నుంచే ఆమెకు ఈతలో తండ్రి దేశింగు శెట్టి ట్రైనింగ్ ఇచ్చారు. ఆయన కూడా ఒక ప్రొఫెషనల్ స్విమ్మర్. బెంగళూరులోని బసవనగుడి ఆక్వాటిక్ సెంటర్‌లో ఎంతోమందికి ఆయన స్విమ్మింగ్‌లో ట్రైనింగ్ ఇస్తుంటారు. తండ్రి స్వయంగా నేర్పడంతో ధీనిధి దేశింగు(Dhinidhi Desinghu) స్విమ్మింగ్‌లో అంతలా రాటుదేలారు.
We’re now on WhatsApp. Click to Join
- ధీనిధి దేశింగు యూనివర్సాలిటీ కోటాలో మహిళల 200 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో ఒలింపిక్స్‌లో భారత్ తరపున పాల్గొనబోతున్నారు.
- బెంగళూరులోని డాల్ఫిన్ ఆక్వాటిక్స్‌లో ఆమె స్విమ్మింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు.
- భారత్‌లో జరిగిన నేషనల్ గేమ్స్‌లో ధీనిధి దేశింగు ఏడు గోల్డ్ మెడల్స్ సాధించారు. ఒక విభాగంలో ఇంతపెద్ద సంఖ్యలో పతకాలు సాధించిన అతి పిన్న వయస్కురాలుగా ఆమె రికార్డ్ సృష్టించారు.
- 200 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ విభాగంలో ధీనిధి దేశింగు నేషనల్ రికార్డును నెలకొల్పారు.
- గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో కూడా ధీనిధి దేశింగు సత్తా చాటారు.
స్విమ్మింగ్ అంటేనే తొలుత ధీనిధి దేశింగుకు ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు అదే స్విమ్మింగ్‌లో ఆమె మన దేశానికి ప్రాతినిథ్యం వహించే స్థాయికి ఎదిగింది. ట్రైనింగ్ తీసుకునే తొలినాళ్లలో స్విమ్మింగ్ పూల్ అంటేనే ఆమె భయపడేది. స్విమ్మింగ్ పూల్‌లోని నీటిలో తల ముంచడానికి ధీనిధి ఇష్టపడేది కాదు. ట్రైనింగ్ పొందుతున్న కొద్దీ.. ఆమెకు స్విమ్మింగ్ పూలే ఒక లోకంగా మారింది. అయితే పేరెంట్స్ ప్రోత్సాహంతో ఆమె స్విమ్మింగ్‌లో రాటుదేలింది. ఇతరుల కంటే బెటర్‌గా స్విమ్మింగ్ స్కిల్స్‌ను పెంచుకుంది. ఆరేళ్ల వయసులో ప్రారంభమైన ధీనిధి ట్రైనింగ్ ఇప్పటికి ఓ గాడిన పడింది. ‘‘అమ్మానాన్న కలిసి నన్ను స్విమ్మింగ్ పూల్‌లోకి దించిన రోజులు నాకు బాగా గుర్తున్నాయి. మొదట్లో వాళ్లిద్దరితో కలిసి నేను పూల్‌లో ఈత కొట్టాను’’ అని ధీనిధి దేశింగు(Youngest Olympian) గుర్తు చేసుకున్నారు.