Special Story: జనరేషన్ మారుతుంది. ఈ కాలంలో ప్రతీది అందుబాటులో ఉంటుంది. పాలకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంది. గతంలో నాటి అవినీతికి అవకాశం లేకుండా ఆన్ లైన్ మయం అయింది. కానీ కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలు అందవు. రోడ్లు ఉండవు. కరెంటు కూడా లేని గ్రామాలూ ఉన్నాయి. పూణేలోని డియోల్ గ్రామానికి వెళ్ళాలి అంటే నీటిలో ఈత కొట్టుకుంటూ పోవాల్సిందే. ఈత రాకపోతే అంతే సంగతులు. దేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ డియోల్ గ్రామానికి 6 కి.మీ దూరంలో ఉన్న దారేవాడికి రోడ్డు లేదు. ఏ వాహనం కూడా వెళ్లడం లేదు. ఎన్నికలొచ్చాక రోడ్డు వేసి ఇక్కడికి కారులో వస్తామని నేతలంతా చెబుతున్నారు. కానీ, ఈ సమస్యకు ఇంతవరకు ఎవరూ పరిష్కారం చూపలేదు. డియోల్ గ్రామంలో సుమారు 225 మంది నివసిస్తున్నారు. వర్షాకాలంలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు, గ్రామం పక్కనే ఉన్న వాగు నీటిలోనే నడవాల్సి వస్తోంది. ఒక వృద్ధుడు లేదా పిల్లవాడు నీటిలో పడి ఏదైనా ప్రమాదం జరిగితే, ఎవరు బాధ్యత వహిస్తారు? అనే ప్రశ్న తలెత్తుతోంది. పాలకవర్గం దీనిపై దృష్టి సారించి రోడ్డు సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే గతంలో రోడ్డు వేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. కానీ స్థానిక ప్రజలు రోడ్డుకు స్థలం ఇవ్వకపోవడంతో రోడ్డు నిర్మించలేకపోయారు. మరి ప్రత్యామ్నాయంగా ఏదైనా చేసి రోడ్డు నిర్మిస్తే బాగుటుంది.
Also Read: Youtuber: ఖరీదైన కారు కొన్న జీపీ ముత్తు