Site icon HashtagU Telugu

Colgate History : కోల్గేట్ పేస్ట్ చరిత్ర తెలుసా.. బాబోయ్ ఇంత స్టోరీ ఉందా..!

Colgate Is Not A Toot Paste Which It Started

Colgate Is Not A Toot Paste Which It Started

History of Colgate Paste Company : నిత్యావసర వస్తువుల్లో రోజు వాడుకునే వాటిలో పేస్ట్ కూడా ఒకటి. అలాంటి పేస్ట్ ల కంపెనీల గురించి చెప్పమంటే కేవలం మన ఆలోచనలకు ఒకటి రెండు మాత్రమే వస్తాయి. ముఖ్యంగా మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా అంటూ సమంత చేసిన యాడ్ అందరికీ తెలిసిందే. మార్కెట్ లో ఎక్కువ శాతం కోల్గేట్ షేర్ ఉంటుందని చెప్పొచ్చు. అయితే కోల్గేట్ కంపెనీ ఎప్పుడు మొదలైంది. ఎవరు మొదలు పెట్టారు. ఆ కంపెనీ తర్వాత ఎలా మారింది అన్నది ఇప్పుడు చూద్దాం.

1806 లో విలియం కోల్గేట్, కోల్గేట్ కంపెనీ (Colgate) స్టార్ట్ చేశారు. మొదట వీరు సోప్స్, క్యాండిల్స్ ని అమ్మడం మొదలు పెట్టారు. ఆ తర్వాత పర్ఫ్యూంస్ కూడా సేల్ చేశారు. అయితే 1873 లో కోల్గేట్ ఓరల్ కేర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. టూత్ పౌడెర్, టూత్ పేస్ట్, మౌత్ ఫ్రెషర్ ఇలా అన్ని ప్రొడక్ట్ లను తయారు చేయడం మొదలు పెట్టింది. అలా మొదలు పెట్టిన కోల్గేట్ పేస్ట్ (Colgate Paste) యూఎస్ లోనే కాదు ఇండియా లో కూడా నెంబర్ 1 పేస్ట్ గా నిలిచింది.

కోల్గేట్ టూత్ పేస్ట్ (Colgate Tooth Paste) ఓవర్ కేర్ బిజినెస్ లో అత్యధిక శాతం మార్కెట్ పర్సెంటేజ్ ని కలిగి ఉంటుంది. ఎంత మార్కెట్ లో కొత్త టూత్ పేస్ట్ లు వచ్చినా కోల్గేట్ షేర్ ని పడగొట్టే పరిస్థితి కనిపించడం లేదు. కోల్గేట్ కంపెనీ ముందు సోప్స్ తో మొదలు పెట్టి ఆ తర్వాత పర్ఫ్యూంస్ రిలీజ్ చేసి చివరగా ఓవర్ కేర్ బిజినెస్ నే మెయిన్ స్ట్రీం బిజినెస్ గా చేసుకుంది.

కోల్గేట్ కి పోటీగా యూఎస్ నుంచి పెప్సోడెంట్ టూత్ పేస్ట్ వచ్చినా కొన్నాళ్లు మాత్రమే అది రాణించగలిగింది. అయితే ఒకానొక దశలో కోల్గేట్ కి గట్టి పోటీ ఇచ్చిన పెప్సోడెంట్ ఆ తర్వాత కస్టమర్స్ ను ఎంగేజ్ అయ్యేలా చేయలేకపోయింది. అయితే కోల్గేట్ మాత్రం ఎప్పటికప్పుడు కొత్త టేస్ట్ లతో టూత్ పేస్ట్ ను మార్చుతూ వచ్చి మార్కెట్ లో దూసుకెళ్తున్నారు.

Also Read:  Ganesh Chaturthi: 300 ఏళ్ల తర్వాత గణేష్ చతుర్థి సందర్భంగా ఆ రాశుల వారి జీవితాలు అద్భుతాలు?

Exit mobile version