Climate Change Impact: వాతావరణ మార్పు ప్రభావంతో కరిగిపోతున్న వెనిజులా మంచు పర్వతాలు

వెనిజులా తన చివరి హిమానీనదాన్ని కోల్పోయింది. ఆ దేశంలోని అండీస్‌లోని సియెర్రా నెవాడా డి మెరిడా పర్వతాలలో కనిపించే హంబోల్ట్ గ్లేసియర్ చిన్నదిగా మారింది. వాతావరణ మార్పుల ప్రభావం దీనికి కారణమని చెబుతున్నారు. హంబోల్ట్ గ్లేసియర్‌ని 'లా కరోనా' అని కూడా అంటారు.

Climate Change Impact: వెనిజులా తన చివరి హిమానీనదాన్ని కోల్పోయింది. ఆ దేశంలోని అండీస్‌లోని సియెర్రా నెవాడా డి మెరిడా పర్వతాలలో కనిపించే హంబోల్ట్ గ్లేసియర్ చిన్నదిగా మారింది. వాతావరణ మార్పుల ప్రభావం దీనికి కారణమని చెబుతున్నారు. హంబోల్ట్ గ్లేసియర్‌ని ‘లా కరోనా’ అని కూడా అంటారు.

ఇటీవలి చరిత్రలో అన్ని హిమానీనదాలను కోల్పోయిన మొదటి దేశంగా వెనిజులా నిలిచింది. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులపై దృష్టి పెట్టాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. అలా చేయడం ద్వారా ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేసి, హిమానీనదాలు మరింత కరగకుండా నిరోధించవచ్చని వారు భావిస్తున్నారు. సముద్ర మట్టానికి సుమారు 5,000 మీటర్ల ఎత్తులో ఉన్న సియెర్రా నెవాడా డి మెరిడా పర్వతాలలో మొత్తం 6 హిమానీనదాలు ఉన్నాయి. వీటిలో ఐదు హిమానీనదాలు 2011కి ముందే కరిగిపోయాయి.

ఈ వాతావరణంలో చివరిగా నిలిచిన హంబోల్ట్ గ్లేసియర్ మరో పదేళ్లు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే, హిమానీనదం వారు ఊహించిన దానికంటే చాలా వేగంగా కరుగుతోంది. ఇప్పుడు అది 2 హెక్టార్ల కంటే తక్కువకు తగ్గిపోయింది.

Also Read: Kodali Nani: సీఎం జగన్  59 నెలల్లో 99శాతం హామీలు అమలు చేశారు: కొడాలి నాని