Landlord Vs Tenant : 11 నెలల అద్దె అగ్రిమెంటులో ఆ ట్విస్ట్.. మీకు తెలుసా ?

Landlord Vs Tenant : మనదేశంలోని పల్లెలు, పట్నాలు, టైర్-2 నగరాల్లో ఇళ్లను అద్దెకు ఇవ్వడం అనేది ఇంటి యజమాని, అద్దెదారు మధ్య పరస్పర అవగాహనతోనే జరిగిపోతుంటుంది. 

  • Written By:
  • Publish Date - February 25, 2024 / 05:54 PM IST

Landlord Vs Tenant : మనదేశంలోని పల్లెలు, పట్నాలు, టైర్-2 నగరాల్లో ఇళ్లను అద్దెకు ఇవ్వడం అనేది ఇంటి యజమాని, అద్దెదారు మధ్య పరస్పర అవగాహనతోనే జరిగిపోతుంటుంది.  వాస్తవానికి ఇంటిని అద్దెకు తీసుకోవాలన్నా, లీజుకు తీసుకోవాలన్నా యజమానికి, అద్దెదారుకు మధ్య ఒప్పందం కుదరాలని చట్టం చెబుతోంది. కానీ చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. కేవలం నోటి మాట ఆధారంగానే ఇంటిని అద్దెకు తీసుకుంటారు. రెంటల్ అగ్రిమెంట్‌లో ఇంటి యజమాని, అద్దెదారుడు అనుసరించాల్సిన నిబంధనలు, షరతులు ఉంటాయి. ఈ ఒప్పందం కనీస వ్యవధి 11 నెలలు ఉంటుంది. ఈ వ్యవధిలోగా అద్దెదారుడు ఇంటిని ఖాళీ చేయొచ్చా ? ఇలా ఇంటిని ఖాళీ చేసేందుకు యజమాని అంగీకరిస్తాడా ?  ఈక్రమంలో అద్దెదారుడికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనేది ఒక కేస్ స్టడీ(Landlord Vs Tenant) ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

We’re now on WhatsApp. Click to Join

నిర్మల (పేరు మార్చాం) అనే మహిళా ఉద్యోగి  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఉన్న సెక్టార్ 34 సొసైటీలో ఓ అపార్ట్‌మెంట్‌ ఫ్లాటును అద్దెకు తీసుకుంటుంది.  ఆ ఫ్లాటులో ఇన్వర్టర్, గీజర్, ఆర్‌ఓ సహా అన్నీ కొత్త సౌకర్యాలే.  వాటిలో ఏదైనా పాడైపోతే మీరే రిపేర్ చేయించాలని అపార్ట్‌మెంట్ యజమాని చెప్పాడు. నిర్మల ఫ్లాట్‌కి వచ్చిన 3 రోజుల తర్వాత.. ఆర్వో,  ఇన్వర్టర్ రెండూ నాసిరకంగా ఉన్నాయని గుర్తించింది. ఈ విషయం యజమానితో చెప్పింది. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. అద్దె ఒప్పందంలో 11 నెలలు అని పేర్కొన్నప్పటికీ, స్నేహను 6 నెలల తర్వాత ఇల్లు ఖాళీ చేయమని యజమాని సూచించాడు. ఒప్పందం చేసుకున్నాక 11 నెలల కంటే ముందు ఇంటిని ఖాళీ చేయమని అద్దెదారుడిని ఇంటి యజమాని ఆదేశించవచ్చా ?

Also Read :Food Crisis : గాజాలో ఆహార సంక్షోభం.. ఆకలి తీరుస్తున్న కలుపుమొక్క గురించి తెలుసా ?

పైవిధమైన సమస్యకు న్యాయ నిపుణుల సూచన ఇలా ఉంది.. 11 నెలల అద్దె అగ్రిమెంట్ టైంలో  అద్దెను పెంచరు. అయితే అద్దెదారుడిని ఇంటిని ఖాళీ చేయమని ఇంటి యజమాని అడగొచ్చు. కానీ వారిని బలవంతంగా ఖాళీ చేయించలేరనే విషయాన్ని మాత్రం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎలాంటి బలవంతం చేయలేరని న్యాయ నిపుణులు అంటున్నారు. ఒక అద్దెదారు 11 నెలల వరకు కచ్చితంగా ఖాళీ చేయనని చెబితే చట్టం ప్రకారం యజమాని ఏమీ చేయలేడని అర్థం. అందుకే అద్దె ఇచ్చేముందు యజమానులు పూర్తి సమాచారం తెలుసుకోవాలి.

Also Read : Expenditure Survey : ఆహారం కంటే వినోదానికే ఎక్కువ ఖర్చు.. గృహ వినియోగ వ్యయ సర్వే విశేషాలు