Site icon HashtagU Telugu

Bigg Boss 7 : ప్రిన్స్ యావర్ ఓవర్ కాన్ ఫిడెంట్ అయ్యాడా..?

Bigg Boss 7 Prince Yawar Over Confident Will Effect His Play In House

Bigg Boss 7 Prince Yawar Over Confident Will Effect His Play In House

Bigg Boss Season 7 : బిగ్ బాస్ సీజన్ 7 రెండు వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. రెండో వారం హౌస్ నుంచి షకీ మా అదేనండి షకీలా ఎలిమినేట్ అయ్యి తన సొంటింటికి వెళ్లిపోయారు. హౌస్ లో రెండు వారాల పాటు తన శక్తి మేరకు టాస్కులు తన మంచి మనసుతో కంటెస్టెంట్స్ మనసులు గెలుచుకున్నారు షకీలా. అయితే ఇంకొన్నాళ్లు ఉండే అవకాశం ఉన్నా ఆమె ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఇదిలాఉంటే హౌస్ లో మోడల్ కమ్ యాక్టర్ ప్రిన్స్ యావర్ కాస్త ఓవర్ కాన్ఫిడెంట్ గా అనిపిస్తున్నాడు.

మొదట్లో ఇతనేంటి ఇంత సైలెంట్ గా ఉంటున్నాడు ఇలా అయితే బిగ్ బాస్ హౌస్ (Bigg Boss House) లో ఎలా అని అనుకున్నారు. కానీ టాస్కుల్లో పర్ఫార్మ్ చేస్తూ కాస్త హడావిడి చేస్తున్నాడు. లాస్ట్ వీక్ గౌతం కృష్ణతో జరిగిన గొడవ వల్ల అతనికి మైలేజ్ పెరిగింది. అతను టాస్క్ ఆడుతున్నా సరే కొందరు రాజకీయాలు చేసి తనని టార్గెట్ చేస్తున్నారని ఫీల్ అవుతున్నాడు యావర్. అయితే అది ఒకటి రెండు సార్లు అంటే ఓకే కానీ ప్రతిసారి తానే టాస్కుల్లో తోపు అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు.

ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అతను ఆడియన్స్ నుంచి కూడా దూరం అవుతున్నాడు. ఈ వారం నామినేషన్స్ లో కూడా యావర్ తన అతి చూపించాడని తెలుస్తుంది. లాస్ట్ వీక్ అతను కష్టపడి ఆడినా హౌస్ గుర్తించలేదని ఆడియన్స్ అతనికి సపోర్ట్ గా ఉన్నారు. కానీ ఈసారి అతనే హౌస్ లో అట్మాస్పియర్ ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తుంది. సో ఇలా చేస్తే లాస్ట్ వీక్ సపోర్ట్ చేసిన ఆడియన్స్ అతన్ని బయటకు పంపించేస్తారు.

ముఖ్యంగా హౌస్ లో ఉన్న ఒకరిద్దరు తప్ప అందరు తన తర్వాతే అన్న భావనలో ఉన్నాడు యావర్. తన మీద తనకు నమ్మకం ఉండటం మంచిదే కానీ ఇతరులను గెస్ చేయడం అతని పని కాదు. యావర్ తన గేమ్ ప్లాన్ అదే అనుకుంటున్నాడో ఏమో కానీ ఇలానే అయితే అతను హౌస్ లో ఎక్కువరోజులు కొనసాగే అవకాశం లేదని చెప్పొచ్చు.

Also Read:  Tamil Nadu Nutmeg : తమిళనాడు జాజికాయలకు విదేశాల్లో భారీ డిమాండ్..!