Site icon HashtagU Telugu

Betting Mafia : ఆశలతో వల.. అప్పులతో ఉరి.. కుటుంబాలు కూలుస్తున్న బెట్టింగ్ యాప్స్

Betting Mafia

Betting Mafia

Betting Mafia : బెట్టింగ్‌ యాప్స్ కుటుంబాలను కూలుస్తున్నాయి.. కొందరు యువతను వాటికి బానిసలుగా మార్చుకుంటున్నాయి.. చెమటోడ్చకుండా ఈజీగా మనీని సంపాదించాలనే అత్యాశతో కొంతమంది ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌ ఆడుతూ ఆర్థికంగా, మానసికంగా నష్టపోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join

సదాశివపేటలో బీటెక్ విద్యార్థి.. 

అప్పులు తెచ్చి మరీ ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్(Betting Mafia), జూదం గేమ్స్ ఆడిన సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన చింత ఆదర్శకుమార్‌ కొడుకు వినీత్‌(25) ఇటీవల ఆత్మహత్యకు పాల్పడాడు. వినీత్‌ బీటెక్‌ ఫైనలియర్‌ విద్యార్థి.  బెట్టింగ్‌లో పెట్టుబడిగా పెట్టేందుకు తెలిసిన మిత్రులు, యాప్‌ల ద్వారా ఇతడు లక్షల్లో అప్పులు చేశాడు. వినీత్ తల్లిదండ్రులు రెండ్రోజుల క్రితం అయోధ్య రామమందిర దర్శనానికి వెళ్లగా.. అప్పులు ఇచ్చిన వారి నుంచి వేధింపులు అధికమయ్యాయి. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వినీత్‌ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read : Kejriwal Wife: సీఎం కేజ్రీవాల్ ని కలిసేందుకు భార్యకు అనుమతి రద్దు

‘స్మార్ట్‌’గా బానిసలై.. దొంగలుగా మారుతున్నారు

బెట్టింగ్‌కు సంబంధించిన ఆన్‌లైన్‌ యాప్‌లు, వెబ్‌సైట్లు అందుబాటులోకి వచ్చాక స్మార్ట్‌ఫోన్ల నుంచే ఈజీగా బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తున్నారు. తొలుత చిన్న పెట్టుబడులు పెట్టినా వందలు, వేల రూపాయల్లో లాభాలు వస్తుండటంతో ఆశ కాస్తా అత్యాశగా మారుతోంది. ఇంకా డబ్బు సంపాదించాలనే ఆలోచనలో భారీగా అప్పులు చేస్తున్నారు. ఆ డబ్బంతా తెచ్చి బెట్టింగ్‌లో పెట్టాక నష్టపోతున్నారు. బెట్టింగ్‌కు అలవాటుపడిన వాళ్లు చివరకు దొంగలుగా కూడా మారుతున్నారు. పరిస్థితులు వాళ్లను అలా మారుస్తున్నాయి. ఓ యువకుడు డ్రైవరుగా పనిచేసేవాడు. అతడు ఒక లోన్‌ యాప్‌లో రుణం తీసుకుని మరీ.. బెట్టింగ్ యాప్‌లో పందేలు కాసేవాడు. అయితే అతడికి బాగా నష్టం వచ్చింది. ఇలా చేసిన అప్పులను తీర్చేందుకు సదరు యువకుడు తన యజమాని తల్లి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు కొట్టేశాడు.  చివరకు ఆదిభట్ల పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. బెట్టింగ్‌కు పెట్టుబడిని సమకూర్చుకునేందుకు దొంగతనాలు చేస్తున్న చాలామంది ఇటీవల కాలంలో తమకు దొరికిపోతున్నారని పోలీసులు చెబుతున్నారు.

Also Read :CSK vs SRH: చెపాక్ లో హైదరాబాద్ ని చిత్తుగా ఓడించిన చెన్నై

బెట్టింగ్ కోసం భర్త రూ.1.5 కోట్ల అప్పు.. భార్య సూసైడ్ 

ఐపీఎల్ బెట్టింగ్‌లో భర్త రూ. 1.5 కోట్లు అప్పులు చేయడంతో కుంగిపోయి ఈ ఏడాది మార్చిలో  కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. మైనర్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ అయిన దర్శన్ బాలు 2021 నుంచి 2023 సంవత్సరం వరకు ఐపీఎల్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. బెట్టింగ్ గేమ్స్‌ ఆడేందుకు బాలు పలువురి వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేశాడు. కొందరికి ఖాళీ చెక్కులు ఇచ్చి 85 లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్నాడు.