Transport Business: బెస్ట్.. ఎవర్ గ్రీన్ బిజినెస్ ఐడియా : ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం

జనాభాలో ఇప్పుడు వరల్డ్ నంబర్ 1 ఇండియా. జనాభా ఎంతగా ఉంటుందో .. అంతగా సక్సెస్ అవకాశాలు ఉండే బిజినెస్ ఒకటి ఉంది. దానికి ఎప్పటికీ గిరాకీ ఉంటుంది. అదే.. ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ (Transport Business).

Transport Business : జనాభాలో ఇప్పుడు వరల్డ్ నంబర్ 1 ఇండియా. జనాభా ఎంతగా ఉంటుందో ..అంతగా సక్సెస్ అవకాశాలు ఉండే బిజినెస్ ఒకటి ఉంది. దానికి ఎప్పటికీ గిరాకీ ఉంటుంది. అదే.. ట్రాన్స్ పోర్ట్ బిజినెస్. మీరు ఎక్కడ ఉంటే అక్కడే ఇది చేసుకొని జీవితంలో స్థిరపడొచ్చు. ఇంతకీ ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి.. ఎలా నడపాలి.. ఎలా సంపాదించాలి అనేది ఇప్పుడు మేం మీకు వివరిస్తాం..

ఇది ఎందుకు బెస్ట్ బిజినెస్ ?

భారతీయ రవాణా వ్యాపారం 2025 నాటికి రూ.38,000 కోట్లకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేసున్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి రవాణా వ్యాపారాన్ని ప్రారంభించడం తెలివైన పెట్టుబడి. మీరు తక్కువ సమయంలో మంచి డబ్బు సంపాదించాలనుకుంటే రవాణా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇందులో ప్రారంభ ఖర్చు కాస్త ఎక్కువే. కార్లు, ట్రక్కులు, మినీ వ్యాన్లు మొదలైన వాటి ద్వారా వస్తువులను లేదా ప్రజలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేయడాన్ని ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ అంటారు. మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ.. ఇప్పుడు మన దేశంలో రవాణా వ్యాపారం యొక్క భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తోంది. మీరు వాహనాన్ని అద్దెకు తీసుకుని కూడా ఈ బిజినెస్ ను ప్రారంభించవచ్చు. అయితే మీ సొంత వాహనంతో వ్యాపారం ప్రారంభించడం బెస్ట్. మీరు ట్యాక్సీ సర్వీస్ ను ప్రారంభించాలనుకుంటే.. మెరుగైన కండీషన్‌తో కూడిన సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనడం ద్వారా కూడా మీరు పనిని ప్రారంభించవచ్చు.

సరుకు రవాణా రంగంలో..

ఒకవేళ మీరు సరుకు రవాణా రంగంలోకి వెళ్లాలనుకుంటే.. మినీ ట్రక్ లేదా టెంపోతో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మీరు కంపెనీల నుంచి.. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వస్తువులను రవాణా చేయడం ద్వారా బాగా డబ్బు సంపాదించవచ్చు. వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన తర్వాత మీరు వాహనాల సంఖ్యను పెంచుకోవచ్చు. లాభాలను పెంచుకోవచ్చు. మీ సొంత రవాణా సంస్థను కూడా స్టార్ట్ చేయొచ్చు.

స్పెషలైజేషన్ ఎంచుకోండి:

వ్యక్తిగత రైడ్ షేరింగ్ సేవలు, టాక్సీలు, వినియోగదారుల రవాణా, వస్తువుల రవాణా, ఉత్పత్తి డెలివరీ వంటి వివిధ కార్యకలాపాలలో రవాణా సంస్థలు స్పెషలైజేషన్ ను కలిగి ఉండవచ్చు.ఇందులో భాగంగా జంతువులు, ముడి సరుకులు, వినియోగ వస్తువులు, ఇతర వస్తువులను స్థానిక మార్కెట్‌ల నుంచి కొనుగోలుదారుల గమ్యస్థానాలకు డెలివరీ చేయొచ్చు. కోస్టల్ ఏరియాల్లో సముద్రం ద్వారా కూడా డెలివరీ సర్వీస్ స్టార్ట్ చేయొచ్చు. మీరు సైకిల్ అద్దె కంపెనీ, లాజిస్టిక్స్ సంస్థ, వైద్య రవాణా సేవ, స్కూల్ పిల్లల రవాణాను కూడా మొదలు పెట్టొచ్చు.

ఇలా స్టార్ట్ చేయండి:

కార్పొరేషన్‌ను సృష్టించడం అనేది మీరు రవాణా సర్వీస్ ను స్టార్ట్ చేయడానికి తొలి మెట్టు. ఇందుకోసం స్థానిక సంస్థ లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందవలసి ఉంటుంది. ఫ్రైట్ ఫార్వార్డర్ల కోసం ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) రిజిస్ట్రేషన్, ఎయిర్ కార్గో ఏజెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ACAAI) రిజిస్ట్రేషన్, ఆదాయపు పన్ను శాఖ, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) మొదలైన వాటితో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి. మీ ఫ్లీట్‌లోని ఏదైనా వాహనం తప్పనిసరిగా వ్యాపార వాహనంగా నమోదు చేసుకోవాలి. అధిక మొత్తంలో సరుకు రవాణా లేదా కార్గో కోసం అనుమతి తీసుకోవాలి. మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే.. డ్రైవర్లు, ప్రయాణీకులు , రవాణా చేసే వస్తువులను కూడా రక్షిస్తాయి. నిర్వహణ ఖర్చులను తీర్చడానికి ఎంత డబ్బు అవసరం? సరఫరాలు, పరికరాలు, కార్మికులపై ఎంత పెట్టుబడి పెట్టాలి ? రుణాలు లేదా ఇతర వనరుల ద్వారా మీ సంస్థ చెల్లించాల్సిన మొత్తం రుణం ఎంత ఉంది ? అనే అంశాలను తెలుసుకోవాలి.

Also Read:  Business Ideas: 30 వేల రూపాయల పెట్టుబడితో ఈ బిజినెస్ ప్రారంభించండి.. యేటా 30 లక్షల రూపాయలు సంపాదించండి..!