Meals On Asteroids : అంతరిక్ష యాత్రలకు వెళ్లే వారి కోసం, వ్యోమగాములకు భోజన ఏర్పాట్లు ఎలా చేయాలి ? అనే అంశంపై సైంటిస్టులు పెద్దఎత్తున రీసెర్చ్ చేస్తున్నారు. ఈ పరిశోధనలతో ముడిపడిన కొత్త సమాచారంతో ఒక అధ్యయన నివేదిక ‘‘ది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆస్ట్రోబయాలజీ’’లో పబ్లిష్ అయింది.
Also Read :Water From Air : కరువుకు చెక్.. గాలి నుంచి నీటి తయారీ పద్ధతి రెడీ
గతంలో అమెరికా రక్షణ శాఖ ఒక కీలకమైన ప్రాజెక్టుపై రీసెర్చ్ చేసింది. ఇందులో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఆహార పదార్థాలుగా మార్చడంపై పరిశోధనలు చేశారు. ఈ ప్రక్రియను పైరోలిసిస్ (Meals On Asteroids) అంటారు. దీని ద్వారా ప్లాస్టిక్ అణువులను ఘన పదార్థాలు, గ్యాస్, నూనెగా మార్చవచ్చు. ప్లాస్టిక్ అణువుల నుంచి రాబట్టిన నూనెను ఒక బయోరియాక్టర్‌లోని బ్యాక్టీరియాలోకి ప్రవేశపెడతారు. దీంతో పోషక విలువలు కలిగిన బయో మాస్ ఉత్పత్తి అవుతుంది. ఈ రీసెర్చ్ రిపోర్టు ఆధారంగానే ఇప్పుడు అమెరికాలోని మిచిగాన్ టెక్నోలాజికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.ఆస్టరాయిడ్స్‌లోనూ కొంతమేర ప్లాస్టిక్స్‌తో సమానమైన లక్షణాలు ఉన్నాయని సైంటిస్టులు చెప్పారు. ప్లాస్టిక్‌లలోని సూక్ష్మ కణాల తరహాలోని ఆస్టరాయిడ్స్‌లోని సూక్ష్మకణాలు ప్రవర్తిస్తున్నాయని తెలిపారు. తమ పరిశోధనలో భాగంగా.. భూమిపై పడిన ఆస్టరాయిడ్ల శాంపిళ్లను సూక్ష్మజీవులకు అందించారు.
Also Read :Women Commandos : మహిళా కమాండోల ధైర్యసాహసాలు.. మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌లో కీలక పాత్ర
తదుపరిగా ఆ శాంపిళ్లపై సూక్ష్మజీవులు కొంతకాలం పాటు సజీవంగా ఉండగలిగాయి. ఆస్టరాయిడ్ల శాంపిళ్ల నుంచే ఆహారాన్ని సూక్ష్మజీవులు తయారు చేసుకున్నాయి. ఇందుకోసం అవి వాడుకున్న పద్ధతిని గుర్తించే పనిలో ఇప్పుడు శాస్త్రవేత్తల టీమ్ ఉంది. ఆస్టరాయిడ్స్‌లోని కర్బన పదార్థాలను సూక్ష్మజీవులతో విచ్ఛిన్నం చేయించి.. వాటిని బయోమాస్ రూపంలోని ఆహారంగా మార్చుకోవచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. అయితే ఇలా తయారయ్యే బయోమాస్ ఫుడ్‌ను తొలుత పలు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అది విషతుల్యంగా లేదు అని నిర్ధారణ అయ్యాకే సైంటిస్టులకు అందిస్తారు. ఇదంతా జరిగేలా ఒక ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ సిస్టమ్‌ను తయారు చేసే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు.