Site icon HashtagU Telugu

Screen Time Effects: గంటల తరబడి ల్యాప్ ట్యాప్ తో వర్క్ చేస్తున్నారా.. అయితే బీఅలర్ట్

Eye Site Technology

Eye

ఈ రోజుల్లో చాలామంది ల్యాప్‌టాప్, కంప్యూటర్, టీవీ లేదా ఫోన్ స్క్రీన్ ముందు రోజుకు 10-12 గంటలు గడుపుతున్నాం. ఎక్కువ స్క్రీన్ సమయం మన కళ్లపై చెడు ప్రభావం చూపుతుంది. ఇది మనకు ఇప్పటికే తెలుసు, అయితే ఎలక్ట్రానిక్ స్క్రీన్‌లు మన కళ్లను ఎలా ప్రభావితం చేస్తున్నాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా. అన్నింటికంటే, స్క్రీన్ కారణంగా మన కళ్ళు చెడిపోతున్నాయి.

UKలోని బ్రాడ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నీమా ఘోరబానీ మొజ్రాద్ మాట్లాడుతూ.. ఆఫీసు సమావేశమైనా లేదా ఆన్‌లైన్ స్టడీ అయినా, ల్యాప్‌టాప్ ప్రతి జీవితంలో భాగంగా మారింది. అయితే దీని వల్ల కళ్లకు చాలా నష్టం జరుగుతుంది. పుట్టినప్పట్నుంచే మన కళ్లు బాగా పనిచేయడం మొదలుపెడుతాయి. సుదూర వస్తువులను స్పష్టంగా చూడవచ్చు. మనం ఎదుగుతున్న కళ్లపై ప్రభావం పడి క్రమంగా చూపు మందగిస్తుంటుంది. కంప్యూటన్, ల్యాప్ టాప్, మొబళ్లను చూస్తూ మరింత చూపు తగ్గే ప్రమాదం ఉందని అంటున్నారు.

మనం ఏదో ఒకదానిపై నిశితంగా దృష్టి పెడుతున్నప్పుడు సిలియరీ కండరాలు – లెన్స్ ఆకారాన్ని బట్టి సర్దుబాటు అవుతాయి. రెటీనా తో పాటు సిలియరీ కండరాలపై అధిక ఒత్తిడి పడుతుంది. దీని వల్ల కళ్లలో నొప్పి రావడం, నీరు కారడం లాంటి మొదలవుతాయి. స్క్రీన్‌పై పనిచేసేటప్పుడు నీలిరంగు ఫిల్టర్‌లతో కూడిన అద్దాలు కళ్ళను రక్షించవు అని డాక్టర్లు చెబుతున్నారు. చాలా గంటలు కంప్యూటర్, మొబైల్ స్క్రీన్‌లపై పని చేయడం వల్ల కంటి ఒత్తిడిని నివారించడానికి బ్లూ లైట్‌ను ఫిల్టర్ అద్దాలకు డిమాండ్ పెరిగింది. అయితే కంటిచూపును కాపాడటంతో ఇవి కొంత వరకు మాత్రమే పనిచేస్తాయని తెలుస్తోంది.

ప్రధానంగా ఈ నీలి కాంతి మన నిద్రను ప్రభావితం చేసే మెలటోనిన్‌ అనే హార్మోను ఉత్పత్తిని, విడుదలను ప్రభావితం చేస్తుంది. ఇతర హార్మోన్లూ తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. నీలికాంతి నేరుగా కంటిలోని రెటీనా పొర మీద పడుతుంది. ఫలితంగా రెటీనా పొర బలహీనపడి చూపు సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు స్క్రీన్లు అన్నింటా దీన్నే విరివిగా వాడుతుండటం వల్ల మన కంటికి ఈ బ్లూలైట్‌ తాకిడి మరింత ఎక్కువైపోతోంది. రోజూ డిజిటల్‌ పరికరాలు వాడుతున్న వారిలో దాదాపు 70% మంది దీనికి సంబంధించిన ఏదో లక్షణాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు మనల్ని ఆకట్టుకుంటున్న ఎల్‌ఈడీ వంటి మిరుమిట్లు గొల్పుతున్న లైట్లన్నింటి నుంచీ కూడా ఈ నీలికాంతి వెలువడుతుంటుంది.

Also Read: Hyderabad: రెయిన్ అలర్ట్.. హైదరాబాద్ లో మూడు రోజుల పాటు వర్షాలు