Ghost Jobs : ‘ఘోస్ట్ జాబ్స్’కు అప్లై చేశారో.. జరిగేది అదే !!

Ghost Jobs : ప్రస్తుతం ‘ఘోస్ట్ జాబ్స్’ ట్రెండ్‌ నడుస్తోంది. కొన్ని కార్పొరేట్ సంస్థలు, చోటా కంపెనీలు నిరుద్యోగులతో ఆడుకుంటున్నాయి.

  • Written By:
  • Updated On - March 25, 2024 / 01:24 PM IST

Ghost Jobs : ప్రస్తుతం ‘ఘోస్ట్ జాబ్స్’ ట్రెండ్‌ నడుస్తోంది. కొన్ని కార్పొరేట్ సంస్థలు, చోటా కంపెనీలు నిరుద్యోగులతో ఆడుకుంటున్నాయి. తమ దగ్గర ఖాళీలు లేకున్నా ఉద్యోగ ప్రకటనలిస్తున్నాయి. ఘోస్ట్​ జాబ్స్ ప్రకటనల విషయంలో నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే టైం వేస్ట్ కావడంతో పాటు మోసపోతారు. చాలామంది అభ్యర్థులు ఇలాంటి ఘోస్ట్ జాబ్స్​ వలలో చిక్కుకొని నెలల తరబడి వేచిచూస్తూ, విలువైన సమయాన్ని, డబ్బును కోల్పోతున్నారు. చివరికి అవి ఘోస్ట్ జాబ్స్(Ghost Jobs) అని తెలుసుకుని ఆవేదనకు గురువుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join

శభాష్ మౌరీన్ క్లాఫ్

ఇటీవల మౌరీన్ క్లాఫ్ అనే మహిళ సోషల్‌మీడియా యాప్‌ ‘థ్రెడ్‌’ వేదికగా ఘోస్ట్ జాబ్స్ బండారాన్ని బయటపెట్టారు. తాను పనిచేస్తున్న కంపెనీలోని హెచ్‌ఆర్‌ సిబ్బంది ఉద్యోగాల భర్తీ కోసం అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయాలని తనను కోరారని ఆమె  చెప్పుకొచ్చారు. వాస్తవానికి కంపెనీలో ఎలాంటి ఖాళీలు లేవని తెలిపారు. ఇతరులను మోసం చేసే ఇలాంటి పనులు చేయనని తాను కంపెనీ హెచ్‌ఆర్‌ సిబ్బందికి స్పష్టం చేశానని మౌరీన్ క్లాఫ్ చెప్పారు. నిజంగా ఆమె తీసుకున్న నిర్ణయం అభినందనీయం, సాహసోపేతం. ఆమె కంపెనీకి కాకుండా.. నైతిక విలువలకు పట్టం కట్టడం చాలా గొప్ప విషయం.

Also Read :NTR: ఆ సినిమాలో ఎన్టీఆర్ డూప్ లేకుండా యాక్షన్ సీన్లు చేస్తున్నారా.. రియల్లీ గ్రేట్ అంటూ?

కొన్ని కంపెనీలు ఘోస్ట్ జాబ్స్ ప్రకటనలు ఇవ్వడానికి భిన్నమైన కారణాలు ఉంటాయి. ప్రతిభావంతులైన అభ్యర్థుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు, కొన్ని కంపెనీలు ఇలా చేస్తుంటాయి. భవిష్యత్తులో అవసరమయ్యే జాబ్​ పొజిషన్స్​ భర్తీ కోసం కూడా ఒక్కోసారి కంపెనీలు ఇలా ఘోస్ట్ జాబ్స్​ గురించి ప్రకటనలు విడుదల చేస్తుంటాయి. సాధారణంగానైతే ఉద్యోగ ప్రకటనల్లో అభ్యర్థుల అర్హతలు,  ఉద్యోగ విధులు, బాధ్యతల గురించి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తారు. కానీ ఘోస్ట్‌ జాబ్స్‌ విషయంలో అలాంటి సమాచారం ఇవ్వరు. ఇంటర్వ్యూలు ఇచ్చాక నెలలు గడిచినా కంపెనీల నుంచి రిప్లై రాదు. అలాంటివి  ఘోస్ట్ జాబ్స్ అని మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా సంస్థ ఉద్యోగ ప్రకటన చేసి చాలా కాలమైనా దాన్ని జాబ్​ పోర్టల్​ నుంచి తీసివేయలేదంటే.. అది కూడా ఘోస్ట్ జాబే.

Also Read :Gandhis Contest : అమేథీ, రాయ్‌బరేలీ నుంచి ‘గాంధీ’లు పోటీ చేస్తారా ? చేయరా ?