Site icon HashtagU Telugu

Unique Railway Station: ఈ రైల్వేస్టేషన్‌లోకి వీసా లేకుండా వెళ్తే అరెస్ట్ ఖాయం

Attari Railway Station Passport Visa Entry Unique Railway Station

Unique Railway Station: మన దేశంలోని ఏ రైల్వే స్టేషన్‌లో అయినా ట్రైన్ ఎక్కేందుకు టికెట్ తీసుకుంటే సరిపోతుంది. కానీ ఒక రైల్వే స్టేషనులో మాత్రం ఏకంగా వీసా, పాస్‌పోర్ట్ అవసరం అవుతాయి. ఆ ఒక్కగానొక్క వెరైటీ రైల్వే స్టేషను గురించి తెలియాలంటే కథనం మొత్తం చదవాల్సిందే.

Also Read :Trump Tower Hyderabad : త్వరలో హైదరాబాద్‌కు ట్రంప్ కుమారులు.. కారణం ఇదే

మీ మెదడులో ఈ ప్రశ్నలు వచ్చాయా ?

మన దేశంలోని ఆ వెరైటీ రైల్వే స్టేషను గురించి తెలుసుకోవాలంటే చాలా దూరం(Unique Railway Station) ప్రయాణించాలి. పంజాబ్‌లోని అమృత్‌సర్ నుంచి పాకిస్తాన్‌లోని లాహోర్ వరకు స్వాతంత్య్రానికి ముందు నుంచే రైల్వే లైను ఉంది. ఈ రైల్వే లైను పరిధిలో మన భారతదేశ భూభాగంలో చిట్టచివరి రైల్వే స్టేషను పేరు అత్తారీ. అక్కడికి మనం వెళ్లి ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేస్తే తప్పకుండా వీసా, పాస్‌పోర్ట్‌లను చూపించమని అడుగుతారు. ఔను.. నిజమే. ఇంతకీ అలా ఎందుకు అనుకుంటున్నారా ? సాధారణ ట్రైను ఎక్కడానికి వీసా, పాస్‌పోర్టులతో పనేంటి అని భావిస్తున్నారా ?

Also Read :Megha : మేఘా, స్కైరూట్‌, యూనీలీవర్.. తెలంగాణలో చేపట్టబోయే ప్రాజెక్టులు ఇవీ

నాడు కళకళ.. నేడు వెలవెల

అత్తారీ రైల్వే స్టేషనులో రైలు ఎక్కడం సంగతి అలా ఉంచండి. మీరు ఆ రైల్వే స్టేషనులోకి ప్రవేశించే క్రమంలోనే చాలా తనిఖీలను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. మన దేశ బార్డర్‌లో ఉండటంతో ఆ రైల్వే స్టేషనులో భారీ భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. ప్రతీ ప్రయాణికుడిని, అతడి లగేజీలను ముమ్మరంగా తనిఖీ చేస్తుంటారు. పాకిస్తాన్ వీసా చూపిస్తేనే ఆ రైల్వే స్టేషనులోకి భద్రతా సిబ్బంది పంపిస్తారు. వీసా లేకుండా ఆ రైల్వే స్టేషనులో ఎవరైనా కనిపిస్తే అరెస్టు చేసి దర్యాప్తు చేస్తారు. అక్కడికి ఎందుకు వచ్చారు ? కారణం ఏమిటి ? ఏం చేయాలని వచ్చారు ? అనే ప్రశ్నలు అడుగుతారు. చట్టపరమైన కేసులను సైతం ఎదుర్కోవాల్సి వస్తుంది. పాకిస్తానీ వీసా లేకుండా ఆ స్టేషనుకు వెళితే జైలుశిక్ష పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే అత్తారీ రైల్వే స్టేషను భారత్-పాక్ మధ్య భూమార్గంలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్‌గా పనిచేస్తుంటుంది. అత్తారీ రైల్వే స్టేషను నుంచే పాకిస్తాన్‌కు సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు నడిచేది. అయితే 2019లో జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఈ రైలు సర్వీసును ఆపేశారు. ప్రస్తుతం ఈ స్టేషన్  నిర్మానుష్యంగా ఉంది.