Micro Retirement : ‘మైక్రో రిటైర్మెంట్’తో ఎంజాయ్.. జనరేషన్‌ జెడ్‌ కొత్త ఆలోచన

విరామ కాలం పూర్తయ్యాక ఉద్యోగంలో తిరిగి చేరాలనే షరతు పెడుతున్నాయి. దీనివల్ల జాబ్ సెక్యూరిటీ(Micro Retirement) ఉంటోంది.

Published By: HashtagU Telugu Desk
Micro Retirement Plan Gen Z Millennials Working Life

Micro Retirement : కాలం మారుతోంది. తరాలు మారుతున్నాయి. వీటితో పాటు ఉద్యోగ ప్రపంచంలో లెక్కలు మారుతున్నాయి. పదవీ విరమణ (రిటైర్మెంట్)కు నిర్వచనం మారుతోంది. రిటైర్మెంట్ అంటే ఒకప్పుడు 60 ఏళ్లు. కానీ ఇప్పుడు ‘మైక్రో రిటైర్మెంట్’ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఇదేమిటి ? తెలుసుకుందాం..

Also Read :Hafiz Saeed : హఫీజ్‌ సయీద్‌ హత్యకు గురయ్యాడా ? నిజాన్ని పాక్ దాస్తోందా ?

‘మైక్రో రిటైర్మెంట్’ అంటే.. ? 

  • జనరేషన్‌ జెడ్‌ అంటే 1997 సంవత్సరం నుంచి 2012 మధ్య జన్మించిన వారు. ఈ కేటగిరీలోని చాలామంది ‘మైక్రో రిటైర్మెంట్’‌కు మొగ్గు చూపుతున్నారు.
  • కెరీర్‌ మధ్యలో ఒక బ్రేక్‌ తీసుకొని.. కొన్నాళ్లు జీవితాన్ని ఎంజాయ్ చేయడాన్ని మైక్రో రిటైర్మెంట్ అంటారు.  తమ ఎంజాయ్‌మెంట్ పూర్తయ్యాక కొత్త ఉద్యోగంలో చేరుతారు.
  • ఈవిధంగా విరామం కోరుకునే ఉద్యోగులకు కొన్ని కంపెనీలు మైక్రో రిటైర్మెంట్ అవకాశాన్ని కల్పిస్తున్నాయి.  సెలవులు మంజూరు చేస్తున్నాయి. విరామ కాలం పూర్తయ్యాక ఉద్యోగంలో తిరిగి చేరాలనే షరతు పెడుతున్నాయి. దీనివల్ల జాబ్ సెక్యూరిటీ(Micro Retirement) ఉంటోంది.
  • జనరేషన్‌ జెడ్‌ ఉద్యోగులకు మానసిక ఆరోగ్యం, వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌‌లపై శ్రద్ధ ఎక్కువ. అందుకే ఈ కేటగిరీ వారు 60 ఏళ్లదాకా కంటిన్యూగా ఉద్యోగం చేయలేమని తేల్చి చెబుతున్నారు.  కెరీర్ మధ్యలో కనీసం ఒక బ్రేక్ కావాల్సిందే అని వాదిస్తున్నారు.
  • కెరీర్ మధ్యలో ఒక బ్రేక్ తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం, ఆరోగ్యంలో ఉత్తేజం వస్తాయని నమ్ముతున్నారు.
  • ‘వయసులో ఉన్నప్పుడే ఎంజాయ్‌ చేయాలి బ్రో’ అంటున్న జనరేషన్ జెడ్ ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
  • మైక్రో రిటైర్మెంట్ తీసుకుంటే.. కొత్త కోర్సులను నేర్చుకొని నైపుణ్యాలను మరింత పెంచుకునే అవకాశం కలుగుతుందని పలువురు అంటున్నారు.
  • అయితే ఈవిధంగా కెరీర్ మధ్యలో తాత్కాలిక రిటైర్మెంట్ కోరే వారిని అన్ని కంపెనీలూ ఉపేక్షిస్తాయా ? అనేది పెద్ద ప్రశ్న. చాలావరకు కంపెనీలు దీర్ఘకాలం పాటు అందుబాటులో ఉండే ఉద్యోగులకే ప్రయారిటీ ఇస్తాయి.

Also Read : Jio Cricket Offer: ఐపీఎల్ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. ఉచితంగా జియోహాట్‌స్టార్‌!

  Last Updated: 17 Mar 2025, 09:32 PM IST