Site icon HashtagU Telugu

Single Ticket – 56 Days : ఒకే ఒక్క టికెట్‌తో 56 రోజుల ట్రైన్ జర్నీ

Single Ticket 56 Days

Single Ticket 56 Days

Single Ticket – 56 Days : ఆ ట్రైన్ టికెట్ తీసుకుంటే 56 రోజుల పాటు రైలులో జర్నీ చేయొచ్చు. ఇది ఒక స్పెషల్ టికెట్. మీరు ఏ క్లాసులోనైనా ఈ టికెట్‌ను తీసుకోవచ్చు. దీన్ని ‘సర్క్యులర్ జర్నీ టికెట్’ అని పిలుస్తారు. దీనితో గరిష్ఠంగా 8 ప్రయాణాలు చేయొచ్చు. అంటే ఒక చోట ప్రయాణాన్ని మొదలుపెట్టి 56 రోజులపాటు దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. అక్కడి నుంచి మళ్లీ ప్రయాణం మొదలు పెట్టిన చోటుకు చేరుకోవచ్చు. అయితే ఈ రూట్ మధ్యలో దిగే స్టేషన్ల సంఖ్య 8కి మించకూడదు. ఒక స్టేషన్​లో దిగి అక్కడ కొన్ని రోజులు గడిపి.. అనంతరం అక్కడి నుంచి మరో ప్రాంతానికి జర్నీ మొదలుపెట్టొచ్చు. సర్క్యులర్‌ జర్నీ టికెట్ల కోసం రైల్వే డివిజన్‌ కమర్షియల్‌ మేనేజర్‌‌ను సంప్రదించాలి. వారు మీ ట్రైన్ జర్నీ ప్లాన్ ఆధారంగా టికెట్‌ ధరను లెక్కించి.. స్టేషన్​ మేనేజర్​కు చెబుతారు. మీరు ప్రయాణం ప్రారంభించే స్టేషన్‌ బుకింగ్‌ ఆఫీసులో సర్క్యులర్‌ టికెట్‌ కొనాలి. మీ బ్రేక్‌ స్టేషన్లను కూడా అక్కడే ఎంచుకోవచ్చు. ఆ తర్వాత మీకు టికెట్‌ను ఇష్యూ చేస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

‘సర్క్యులర్ జర్నీ టికెట్’ ధరను ఎలా నిర్ణయిస్తారు  ?

టికెట్ చెల్లుబాటు కాలం, ప్రయాణించే రోజులు,  విరామం తీసుకునే రోజులు.. ఇలా అన్ని అంశాలను లెక్కించి సర్క్యులర్ జర్నీ టికెట్ ధరను డిసైడ్ చేస్తారు. 400 కిలోమీటర్ల దూరానికి 1 రోజుగా లెక్కిస్తారు. ప్రయాణం చేయని రోజును 200 కిలో మీటర్లుగా లెక్కిస్తారు. సీనియర్ సిటిజన్లకు కనిష్ఠంగా 1000 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తే టికెట్ ధరపై సబ్సిడీ ఇస్తారు.పురుషులకైతే 40 శాతం, మహిళలకైతే 50 శాతం రాయితీ దక్కుతుంది. సర్క్యులర్ జర్నీ టికెట్‌పై ప్రయాణికుడి సంతకం ఉండాలి. ఈ టికెట్ ధర.. సాధారణ టికెట్​తో పోలిస్తే(Single Ticket – 56 Days) తక్కువే.

Also Read: H1B Visa : గుడ్ న్యూస్.. హెచ్‌-1బీ వీసాల రెన్యూవల్ ఇక అమెరికాలోనే