Site icon HashtagU Telugu

Year of Elections – 2024 : ఎన్నికల నామసంవత్సరం 2024.. 40కిపైగా దేశాల్లో పోల్స్

Year Of Elections 2024

Year Of Elections 2024

Year of Elections – 2024 : 2024 సంవత్సరం మరో స్పెషాలిటీని కూడా కలిగి ఉంది. న్యూ ఇయర్‌లో మన ఇండియాతో పాటు ప్రపంచంలోని 40కిపైగా దేశాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రపంచంలోని 40 శాతానికిపైగా జనాభా ఈ ఎన్నికల్లో ఓట్లు వేయబోతోంది. ఈ దేశాలు ప్రపంచ జీడీపీలో అత్యధిక శాతం వాటాను కలిగి ఉన్నాయి. ప్రపంచ పెద్దన్నగా చెప్పుకొనే అమెరికా, అమెరికాను ఛాలెంజ్ చేస్తున్న రష్యా, డెవలప్ అవుతున్న భారత్‌, బ్రిటన్‌, మెక్సికో, దక్షిణాఫ్రికా, ఇరాన్‌, దక్షిణ సూడాన్‌, తైవాన్‌, భూటాన్‌, యూరోపియన్‌ యూనియన్‌ ఎన్నికలు ఈ సంవత్సరం జరుగనున్నాయి. ఈ దేశాల్లో ఎలాంటి ప్రజాతీర్పు వస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వాలకు అనుగుణంగా ఆయా దేశాల ఫారిన్ పాలసీలు మారిపోతాయి. అందుకే ఈ 40 దేశాల ఎన్నికల ఫలితాలపై(Year of Elections – 2024) యావత్ ప్రపంచం ఫోకస్ ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

  • ఇండియాలో ఏప్రిల్‌-మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీజేపీ, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోటీ ఉంది. హిందీ బెల్టు రాష్ర్టాలు, హిందూ ఓటర్లపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి చతికిలపడ్డ కాంగ్రెస్‌.. ఇండియా కూటమి సహకారంతో బీజేపీని ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది.
  • వచ్చే ఏడాది నవంబర్‌లో అమెరికా ఎన్నికలు జరుగనున్నాయి.
  • అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఆయనకు వయసు (81 ఏళ్లు) మైనస్ పాయింట్‌గా మారనుంది.
  • రిపబ్లికన్‌ పార్టీ నుంచి అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్ధిత్వం కోసం 77 ఏండ్ల మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారతీయ వ్యాపారవేత్త వివేక్‌ రామస్వామి, భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ హోరాహోరీగా తలపడుతున్నారు.
  • అమెరికాలో భారతీయులు అత్యధికంగా ఉంటారు. అక్కడ కొత్తగా ఏర్పడే సర్కారును బట్టి ప్రవాస భారతీయుల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. వీసాల సంఖ్య పెంపు, గ్రీన్‌కార్డుల జారీ వంటి అంశాలపై నూతన ప్రభుత్వం నిర్ణయాలు కీలకంగా మారుతాయి.
  • రష్యాలోనూ 2024 మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. సుదీర్ఘ కాలంగా రష్యాలో అధికారంలో ఉన్న 71 ఏళ్ల పుతిన్‌ మరోసారి పోటీ చేయనున్నారు. 2036 వరకు అధ్యక్షుడిగా కొనసాగేందుకు అనుగుణంగా రష్యా రాజ్యాంగంలో ఇప్పటికే పుతిన్ సవరణ చేశారు.  అప్పటివరకు అధికారంలో కొనసాగితే అత్యధిక కాలం రష్యాను పాలించిన జోసెఫ్‌ స్టాలిన్‌ను పుతిన్‌ అధిగమిస్తారు.
  • ఉక్రెయిన్‌ యుద్ధాన్ని సాకుగా చూపించి పుతిన్ తన రాజకీయ ప్రత్యర్థులపై ఉక్కుపాదం మోపారు. చిరకాల ప్రత్యర్థి నావెల్నీ ఇప్పటికే జైలులో ఉన్నారు. దీంతో ఆయనపై పోటీ పడేందుకు ప్రత్యర్థులే కానరావడం లేదు.

Also Read: Ayodhya – Hyderabad : మేడిన్ హైదరాబాద్.. అయోధ్య రామమందిరం తలుపుల తయారీ ఇక్కడే

Exit mobile version