Site icon HashtagU Telugu

2 Years For Yuvagalam Padayatra : రాష్ట్ర భవిత మార్చిన భరోసా యాత్ర

Yuvagalam2yrs

Yuvagalam2yrs

తెలుగుదేశంలో నూతనోత్తేజం, కార్యకర్తల్లో భరోసా నింపడంతోపాటు రాష్ట్ర యువత భవితకు హామీ, మహిళలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమంటూ.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) నేటికీ రెండేళ్లు పూర్తి చేసుకుంది. అడుగడుగునా జనం నుంచి విశేష మద్దతుతో పాదయాత్ర అప్రతిహతంగా సాగింది. అలుపెరగని అడుగులు పల్లెలు, పట్టణాలను దాటుకుంటూ వడివడిగా సాగుతూ.. అనేక ఆటంకాలు, అడ్డంకులను అధిగమించి యువనేత ముందడుగు వేశారు. ఓ విభిన్న లక్ష్యంతో చేపట్టిన ఈ పాదయాత్ర ద్వారా లోకేశ్ పూర్తి సక్సెస్ సాధించారు. లోకేశ్ యాత్ర ఫలితంగా ఏపీలో తిరిగి టీడీపీ అధికారంలోకి రావడమే కాదు గతంలో కంటే రికార్డు మెజారిటీతో అధికారం చేపట్టింది. కనీసం రాజధాని కూడా లేని ఏపీని గట్టెక్కించగలగడం ఒక్క టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికే సాధ్యమని భావించిన రాష్ట్ర ప్రజలు టీడీపీకి అధికారం కట్టబెట్టారు.

Land registration Value Increase : ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంపు..

గత వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై సమరశంఖం పూరిస్తూ ప్రారంభించిన యువగళం పాదయాత్రకు ఈరోజుతో అంటే జనవరి 27వ తేదీతో సరిగ్గా రెండేళ్లు ముగుస్తాయి. లోకేశ్‌ 2023 జనవరి 27న పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కుప్పం వరదరాజస్వామి పాదాల చెంత యువకులం పాదయాత్రను ప్రారంభించారు రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3,132 కిలోమీటర్లు నడిచారు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ పాదయాత్ర సాగించారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించి, ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడంలో ఆయన పాదయాత్ర కీలకభూమిక పోషించింది. యువగళం సాగిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90 చోట్ల టీడీపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించారంటే పాదయాత్ర ప్రభావమెంత ఉందో అర్థమవుతోంది.

యువగళం దిగ్విజయంగా సాగుతున్న సమయంలో… రాష్ట్రంలో ప్రజల మూడ్ అంతా మారిపోయిందని అర్థం కావడంతో .. చివరి ప్రయత్నంగా చంద్రబాబును అరెస్టు చేసింది జగన్ రెడ్డి సర్కార్. కర్నూలులో చంద్రబాబు రాజకీయ పర్యటనలో ఉండగానే అర్థరాత్రి అరెస్టు చేశారు. నారా లోకేష్ తప్పనిసరిగా పాదయాత్రకు విరామం ఇవ్వాల్సి వచ్చింది. పాదయాత్రతో ప్రజల్లో లోకేష్ ఇమేజ్ పెరిగిపోగా.. చంద్రబాబు ను జైల్లో పెట్టిన తర్వాత జగన్ రెడ్డి నిర్వాకాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి తన సమర్థతను నిరూపించుకున్నారు. జాతీయ నేతలతో లోకేష్ కు మంచి పరిచయాలు.. అభిమానం ఏర్పడటానికి కారణం అయింది. సిక్కోలు వరకూ సాగాలనుకున్న పాదయాత్రను విశాఖలోనే ముగించినా.. అప్పటికే లక్ష్యాన్ని సాధించేశారు. వైసీపీని భూస్థాపితం చేసేశారు. జగన్ రెడ్డి అసెంబ్లీ వైపు చూడాలంటే భయపడేలా చేశారు.

Brydon Carse: ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ పై కన్నేసిన కావ్య పాప

నారా లోకేష్ ను ఒకప్పుడు ఎగతాళి చేసిన వారికి ఇప్పుడు నిప్పు. ఇప్పుడు ఎంతగా భయపడుతున్నారంటే .. తమ అక్రమాలు ఎక్కడబయట పెట్టి లోపలికి పంపుతాడోనని వైసీపీలోని సగం మంది ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కలలోనూ వారికి రెడ్ బుక్ కనిపించేలా లోకేష్ చేసాడు. ప్రస్తుతం మంత్రి గా రాష్ట్ర అభివృద్ధి లో కీలక పాత్ర పోషిస్తున్నారు. యువగళం పాదయాత్ర తనకు జీవితకాలం గుర్తుండిపోయే అరుదైన జ్ఞాపకమని మంత్రి నారా లోకేశ్​ తెలిపారు. నియంతృత్వాన్ని, నిర్బంధాలను దాటుకొని రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాలు, 97 నియోజకవర్గాలు, 2,097 గ్రామాలు మీదుగా 226 రోజులపాటు 3132 కి.మీ. సాగిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర మొదలై నేటికి రెండేళ్లని ఆయన గుర్తు చేశారు.

నాటి పాలకులు పాదయాత్ర ఆపడానికి చెయ్యని ప్రయత్నం లేదని మైక్ వెహికల్ సీజ్ చెయ్యడం దగ్గర నుంచి వాలంటీర్లును అరెస్టు చేయడం వరకూ అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారని అన్నారు. నాటి పాలకులు ఎన్ని అడ్డంకులు పెట్టినా ప్రజలు చూపించిన ప్రేమ తనను మరింత దృఢంగా మార్చిందన్నారు. పాదయాత్ర ప్రతీ అడుగులో ప్రజల కష్టాలు చూసానని ఆ రోజు చూసిన కన్నీటి గాథలు నేటికీ తనకు గుర్తున్నాయని అన్నారు. యువగళం పాదయాత్రలో ప్రత్యక్షంగా- పరోక్షంగా భాగమైన ప్రతి ఒక్కరికీ, తనను ఆదరించిన ప్రజలకు లోకేశ్​ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.