చెన్నై (Chennai) విమానాశ్రయంలోని మల్టీ లెవల్ కార్ పార్కింగ్ (MLCP) నాలుగో అంతస్తు నుంచి శుక్రవారం రాత్రి 33 ఏళ్ల మహిళ దూకి ఆత్మహత్య (Suicide) చేసుకుంది. మృతురాలిని పోజిచల్లూరు కమిషనర్ కాలనీకి చెందిన ఐశ్వర్యగా గుర్తించారు. ఐశ్వర్య భర్త బాలాజీ అమెరికాకు చెందిన ఓ సంస్థలో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం రాత్రి ఐశ్వర్య ఇద్దరు పిల్లలతో కలిసి చెన్నై విమానాశ్రయంలోని మల్టీప్లెక్స్‌లో సినిమా చూడటానికి వెళ్లారు.
సినిమా మధ్యలో ఐశ్వర్య టాయిలెట్‌కి వెళ్తున్నానని పిల్లలకు చెప్పి థియేటర్ నుంచి బయటకు వచ్చింది. అనంతరం నాలుగో అంతస్తులోని MLCP వద్దకు వెళ్లి దూకి ఆత్మహత్య చేసుకుంది. భద్రతా అధికారులు అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఐశ్వర్య తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు తెలిపారు.
Also Read: Crime News: ఐదేళ్ల క్రితం జరిగిన హత్యపై ఇప్పుడు కేసు నమోదు
చెన్నై ఎయిర్‌పోర్టు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోమ్‌పేట జీహెచ్‌కు పంపగా, పోలీసులు కేసు నమోదు చేసి ఐశ్వర్య ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందో..? ఆమె భర్తతో ఏమైనా సమస్య వచ్చిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గత కొంత కాలంగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నట్టు బంధువులు పేర్కొన్నారు.