Woman – 40 Years Jail : అమ్మతనం సిగ్గుతో తలదించుకునేలా ఆ మహిళ ప్రవర్తించింది. తన ఇద్దరు మైనర్ కూతుళ్లతో అమానుషంగా వ్యవహరించింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న భర్తను వదిలేసిన ఆ మహిళ.. ఇద్దరు వ్యక్తులతో కలిసి జీవించసాగింది. ఈక్రమంలో తన మైనర్ కూతుళ్లపై లైంగిక దాడి చేసేందుకు ఆ ఇద్దరు వ్యక్తులకు సహకారం అందించిన కేసు కేరళలో సంచలనం క్రియేట్ చేసింది. ఈ నేరాన్ని తీవ్రంగా పరిగణించిన కేరళ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. ఆ రాక్షస తల్లికి క్షమాపణ కోరే అర్హత కూడా లేదని వ్యాఖ్యానించింది. ఆ మహిళకు 40 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రూ. 20,000 జరిమానా విధించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఆ మహిళ ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత.. తన భర్తను వదిలేసి విడిగా జీవించసాగింది. అయితే 2018 నుంచి ఆమె తన ఇద్దరు లవర్స్‌తో కలిసి జీవించడం ప్రారంభించింది. వీరిలో ఒక వ్యక్తి పేరు శిశుపాలన్, మరో వ్యక్తి పేరు తెలియరాలేదు. ఈక్రమంలో 2018 మార్చి నుంచి 2019 సెప్టెంబర్ మధ్య కాలంలో చాలాసార్లు తన ఇద్దరు మైనర్ కూతుళ్లపై అత్యాచారం చేసేందుకు ఇద్దరు లవర్స్‌కు సహకరించింది. వారి ఇళ్లకు తన మైనర్ కూతుళ్లను తీసుకెళ్లి అత్యాచారం చేయించేదని దర్యాప్తులో వెల్లడైంది. 22 మంది వ్యక్తులు ఈ కేసులో కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పారు. అయితే ఆ మహిళ లవర్స్ బెదిరించడం వల్ల పిల్లలు విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. చివరకు ఒకరోజు మహిళ చిన్నకూతురు(11) తన అక్కతో ఈవిషయాన్ని చెప్పింది. ఆ తర్వాత ఆమె తన చెల్లిని తీసుకొని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. దీనిపై పిల్లల అమ్మమ్మ పోలీసులకు కంప్లయింట్ చేసింది. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి.. పిల్లలను చిల్డ్రెన్స్ హోంకు తరలించారు. కాగా, ఈ కేసులో మొదటి నిందితుడు శిశుపాలన్ ఇప్పటికే ఆత్మహత్య(Woman – 40 Years Jail) చేసుకున్నాడు.