Shashi Tharoor: సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌పై కాంగ్రెస్ ఇప్పుడు ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఆయన వ్యాఖ్యలను పార్టీ నిశితంగా పరిశీలిస్తోంది. ‘‘కాంగ్రెస్ కనుక నా సేవలను వినియోగించుకోకూడదని భావిస్తే, నాకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి’’ అని ఇప్పటికే థరూర్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ను వీడేందుకైనా రెడీ అని ఆయన చెప్పకనే చెప్పేశారు. అంతేకాదు కేరళలోని వామపక్ష ప్రభుత్వం పనితీరును శశి థరూర్ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పనితీరుపైనా ప్రశంసల జల్లు కురిపించారు. దీంతో ఆయన ఫ్యూచర్‌లో ఏదైనా ఇతర పార్టీలో చేరుతారనే టాక్ మొదలైంది.
Also Read :Kash Patel Vs Elon Musk : అమెరికా సర్కారులో ‘మస్క్’ దుమారం.. పెదవి విరిచిన కాష్ పటేల్
2026లో పోల్స్.. సీఎం పదవిపై ఆసక్తి ?
కేరళలో వచ్చే సంవత్సరం (2026లో) అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలోని వామపక్ష ప్రభుత్వాన్ని శశిథరూర్ ప్రశంసించడాన్ని కాంగ్రెస్ హైకమాండ్‌లోని పెద్దలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏ నాయకుడైనా సరే, కాంగ్రెస్ పార్టీ విధానాలకు అనుగుణంగానే రాజకీయంగా స్పందించాలని హస్తం పార్టీ హైకమాండ్ వర్గాలు చెబుతున్నాయి. స్వేచ్ఛ ఉంది కదా అని, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఉపేక్షించే అవకాశాలు లేవు. కేరళ సీఎం పదవికి తాను అర్హుడినని ఇటీవలే శశిథరూర్ చెప్పుకొచ్చారు. అంటే ఆయనకు సీఎం పదవిపై ఇంట్రెస్టు ఉందనే విషయం స్పష్టం అవుతోంది. ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించకుంటే.. శశిథరూర్ తన దారి తాను చూసుకునే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 18వ శతాబ్దం నాటి ఆంగ్ల కవి థామస్ గ్రే కవితలోని కొన్ని పదాలతో ఇటీవలే శశిథరూర్(Shashi Tharoor) ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘అజ్ఞానం ఆనందంగా ఉన్న చోట తెలివిగా ఉండటం మూర్ఖత్వం’’ అని అందులో ప్రస్తావించారు. దీన్ని పరిశీలించినా.. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పాలనే ఆయన ఆలోచనే స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
Also Read :SLBC Tunnel: ఏమిటీ ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ? 20 ఏళ్లుగా ఎందుకు నిర్మిస్తున్నారు ?
రాహుల్‌తో భేటీ అనంతరం..
కాంగ్రెస్ పార్టీలో తన పాత్ర ఏమిటి ? అనే అంశంలో క్లారిటీ లేకపోవడంతో శశిథరూర్ అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. పార్లమెంటులో జరుగుతున్న కీలక డిబేట్‌లలో పాల్గొనే అవకాశాన్ని తనకు ఇవ్వడం లేదనే అభిప్రాయంతో థరూర్ ఉన్నారట. ఈనేపథ్యంలో రాహుల్ గాంధీని గత మంగళవారం రోజు శశిథరూర్ కలిశారు. ‘‘పార్టీ మిమ్మల్ని పక్కకు పెట్టడంతో అసంతృప్తిగా ఉన్నారా?’’ అని థరూర్‌ను మీడియా అడిగినప్పుడు.. ‘‘నేను ఎప్పుడూ ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదు’’ అని బదులిచ్చారు.