తమిళనాడు రాష్ట్రంలోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన(Karur Stampede)లో 41 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. “ఇంత పెద్ద ప్రాణనష్టం జరిగితే కేవలం ఇద్దరు కిందిస్థాయి నేతలను అరెస్ట్ చేయడమేనా?” అంటూ ప్రభుత్వం తీరుపై ప్రశ్నలు గుప్పించింది. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత విభాగాలు ఒత్తిడికి గురయ్యాయి.
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తీపి కబురు..!
ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం TVK (తమిళగ పులకటి కచ్ఛి) అధినేత విజయ్‌పై చర్యలు తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తోంది. తొక్కిసలాటకు కారణమైన కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యం, నిర్వహణ లోపాలపై కేసు నమోదు చేయడం, నిందితుడిగా చేర్చడం వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. హైకోర్టు చేసిన ప్రశ్నల నేపథ్యంలో ప్రభుత్వానికి తప్పనిసరిగా ఏదో చర్య తీసుకోవాలన్న భావన నెలకొంది.
అయితే ఏ నిర్ణయం తీసుకున్నా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని TVK నేతల భేటీలో విజయ్ స్పష్టం చేశారు. ప్రజల కోసం తాను పనిచేస్తానని, రాజకీయ ఒత్తిడులు, చట్టపరమైన చర్యలు తనను ఆపలేవని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు జోక్యం, ప్రభుత్వ పరిశీలన, విజయ్ వ్యాఖ్యలు ఇవన్నీ కలిపి ఈ సంఘటనకు రాజకీయ రంగు పులుముతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
