Site icon HashtagU Telugu

Udhayanidhi Stalin : మరో హీరోకు డిప్యూటీ సీఎం పదవి ..?

Udhayanidhi Stalin To Be De

Udhayanidhi Stalin To Be De

చిత్రసీమ (Film Industry ) కు , రాజకీయ (Political ) రంగానికి దగ్గర సంబధం ఉన్న సంగతి తెలిసిందే. సినిమాల్లో రాణించిన వారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ముఖ్యమంత్రులు , మంత్రులు , ఎమ్మెల్యేలు అయినా దాఖలు ఎన్నో ఉన్నాయి. అందరికి ఆలా కలిసిరాలేదు. కొంతమంది రాజకీయాల్లోకి వచ్చిన కొంతకాలానికే వెనుతిరిగి మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. ఇక ఇదిలా ఉంటె తాజాగా మరో హీరో కు డిప్యూటీ సీఎం పదవి దక్కబోతుందనే వార్తలు మీడియా లో హైలైట్ అవుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

రీసెంట్ గా ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏపీ డిప్యూటీ (AP Deputy CM) పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ తరుపున ఆయన పిఠాపురం నుండి విజయం సాధించడమే కాదు తన పార్టీ తరుపున బరిలో నిల్చున్న 22 అసెంబ్లీ ,2 పార్లమెంట్ స్థానాలు సైతం గెలిపించారు. అంతే కాదు ఎన్నికల్లో కూటమి విజయానికి కీలక పాత్ర పోషించాడు. దీంతో ఆయనకు డిప్యూటీ పదవి తో పాటు పలు శాఖలకు మంత్రిగా బాధ్యత చేపట్టి తన మార్క్ చూపిస్తున్నారు.

ఇక ఇప్పుడు మరో సినీ హీరో డిప్యూటీ సీఎం పదవి దక్కించుకోబోతున్నాడనే వార్తలు వైరల్ గా మారాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, కేబినెట్ మంత్రి, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) ఉప ముఖ్యమంత్రి (Tamil Nadu Deputy Chief Minister)గా పదోన్నతి పొందనున్నారనే వార్తలు ఇప్పుడు తమిళనాట చక్కర్లు కొడుతున్నాయి. తన మంత్రివర్గంలో ఉదయనిధి స్టాలిన్‌కు చోటు కల్పించిన ఎంకే స్టాలిన్.. ఏకంగా డిప్యూటీ సీఎం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సీఎంగా ఉన్న ఎంకే స్టాలిన్ ఆరోగ్యపరంగా కూడా అప్పుడప్పుడూ చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించాలంటే మంత్రిగా కంటే ఉపముఖ్యమంత్రిగా ఉండడం మంచిది అనే ఆలోచనతో ఎంకే స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక మరో రెండేళ్లలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన రాజకీయ వారసుడిని మరింత బలంగా తీర్చిదిద్దేందుకు ఎంకే స్టాలిన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ పదవి ఫై ఉదయనిధి కూడా కాస్త ఆసక్తిగానే ఉన్నట్లు టాక్. చూద్దాం ఏంజరుగుతుందో..!!

Read Also : Baby Born with Teeth : 32 పళ్లతో పుట్టిన బాబు..సోషల్ మీడియా లో వైరల్