Air Hostess Died: డేటింగ్ లో ట్విస్ట్.. ఎయిర్ హోస్టెస్ ను చంపేసిన ప్రియుడు!

డేటింగ్ (Dating) యాప్ ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు ఆ ఇద్దరూ

Published By: HashtagU Telugu Desk
Whatsapp Image 2023 03 14 At 12.32.12 Pm

Whatsapp Image 2023 03 14 At 12.32.12 Pm

తనను పెళ్లి చేసుకోకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ప్రియురాలు అయిన ఎయిర్ హోస్టెస్ (Air Hostess) చెప్పడంతో పెళ్లి ఒత్తిడి తట్టుకోలేక ప్రియుడు ఆమెను హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వీరిద్దరూ డేటింగ్ (Dating) యాప్ ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు. అయితే ఈ క్రమంలో మూడునెలలుగా, ఎయిర్ హోస్టెస్ (Air Hostess) అర్చన తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోంది.

దుబాయ్ నుంచి బెంగుళూరు వచ్చిన ఎయిర్ హోస్టెస్ అర్చన, ప్రియుడి మద్య తీవ్ర చర్చ నడిచింది. పెళ్లి చేసుకోకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అర్చన హెచ్చరించింది. దీంతో కోపోద్రిక్తుడైన ప్రియుడు ఆదేశ్ అపార్ట్ మెంట్ నుంచి బయటకు నెట్టేశాడు. దీంతో అర్చన మృతి చెందింది. అర్చనను హత్య చేసిన తర్వాత నిందితుడు ఆమె తండ్రికి ఫోన్ చేసి మద్యం మత్తులో తన కూతురు భవనంపై నుంచి పడిపోయిందని చెప్పాడని పోలీసులు తెలిపారు. పోలీసులకు కూడా ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేశాడు.

మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. భవనంపై నుంచి (Air Hostess) తోసి చంపేశాడని ఆరోపించారు. ఈ ఘటన కోరమంగళ ప్రాంతంలోని రేణుకా రెసిడెన్సీ ఆవరణలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల అర్చన ప్రముఖ విమానయాన సంస్థలో పని చేసింది. నిందితుడు ఆదేశ్ కేరళ వాసి.

Also Read: UP Women: శ్రీకృష్ణుడే ఆమె భర్త.. విగ్రహంతో ఏడడుగులు వేసిన మహిళ!

  Last Updated: 14 Mar 2023, 03:01 PM IST