Tamil Nadu Exit Poll Results : ఎలక్షన్స్ రిజల్ట్స్ వేళ త్రిష పోస్ట్ వైరల్

ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం విజయ్ పార్టీ కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉండటంతో, ఫలితాల తర్వాత త్రిష తన రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ 'మే సీజన్' పోస్ట్ మాత్రం కోలీవుడ్ నుంచి పొలిటికల్ సర్కిల్స్ వరకు వైరల్

Published By: HashtagU Telugu Desk
Huge remuneration after a hit... Trisha shocks producers.

Huge remuneration after a hit... Trisha shocks producers.

తమిళనాడు రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) అనూహ్య రీతిలో ఎగ్జిట్ పోల్స్‌లో దూసుకుపోతుండటంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ నేపథ్యంలో విజయ్‌కు అత్యంత సన్నిహితురాలిగా పేరున్న హీరోయిన్ త్రిష తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. తన క్యూట్ ఫోటోను షేర్ చేస్తూ.. “మే (మీ) సీజన్ అధికారికంగా ప్రారంభమైంది” (May season officially started) అంటూ ఆమె ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు చర్చకు దారితీసింది. ఈ పోస్ట్ కేవలం తన పుట్టినరోజు కోసమేనా లేక ఇందులో ఏదైనా రాజకీయ అర్థం ఉందా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

పుట్టినరోజు వేడుకలా? విజయ్ గెలుపుపై ధీమానా?

త్రిష పోస్ట్‌పై సోషల్ మీడియాలో రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. మే 4వ తేదీన త్రిష తన 43వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఆ సందర్భంగానే మే నెల తనది అని చెప్పడానికి ఆమె ఆ క్యాప్షన్ ఇచ్చారని ఒక వర్గం అంటోంది. అయితే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడిన వెంటనే ఈ పోస్ట్ రావడం చూస్తుంటే, ఇది ఖచ్చితంగా విజయ్ పార్టీ TVK విజయానికి సంకేతమని దళపతి అభిమానులు సంబరపడుతున్నారు. “మే 4న తన బర్త్ డే, మే 19న (ఫలితాల రోజు) తన స్నేహితుడు విజయ్ గెలుపు.. అందుకే ఈ ‘మే సీజన్’ అంటూ త్రిష హింట్ ఇచ్చారు” అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మే నెలలో విజయ్ సీఎం పీఠాన్ని అధిష్టిస్తారనే నమ్మకంతోనే ఆమె ఇలా రాసుకొచ్చారని చర్చ నడుస్తోంది.

TVKలోకి త్రిష ఎంట్రీ? పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ

ఎన్నికలకు ముందు నుండే త్రిష విజయ్ స్థాపించిన TVK పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. విజయ్‌తో ఉన్న సుదీర్ఘ స్నేహం, ఇటీవల వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల సక్సెస్ నేపథ్యంలో ఆమె పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా మారుతారని అంతా భావించారు. నేరుగా రాజకీయాల్లోకి రాకపోయినా, పరోక్షంగా విజయ్‌కు మద్దతు తెలపడం ద్వారా ఆమె తన వైఖరిని స్పష్టం చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం విజయ్ పార్టీ కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉండటంతో, ఫలితాల తర్వాత త్రిష తన రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ ‘మే సీజన్’ పోస్ట్ మాత్రం కోలీవుడ్ నుంచి పొలిటికల్ సర్కిల్స్ వరకు వైరల్ అవుతోంది.

  Last Updated: 02 May 2026, 03:52 PM IST