Site icon HashtagU Telugu

PK Plan : పీకే రాజకీయ మంత్రం.. తమిళనాడులో ఏపీ ఫార్ములా

Prashant Kishor Plan For Tamil Hero Vijay Anna Dmk Ap Politics

PK Plan : హీరో విజయ్‌కు ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన  రాజకీయ వ్యూహంపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. తమిళనాడు రాజకీయ సమీకరణాల్లో మార్పు తెచ్చేలా పీకే వ్యూహం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పీఠంపై ఉన్న డీఎంకేకు చెక్ పెట్టేలా ఈ స్కెచ్ ఉండబోతోందని అంటున్నారు. ఇంతకీ అదేమిటో చూద్దాం..

Also Read :Telangana MLC Polls: టీచర్ ఎమ్మెల్సీ పోల్స్.. విజేతను నిర్ణయించేది ఆ ఓట్లే

పెద్ద ప్లానే.. 

డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలకు అస్సలు పొసగదు. ఈ రెండు పార్టీలు మొదటి నుంచీ పరస్పర వ్యతిరేకంగానే పనిచేస్తున్నాయి. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న పీకే(PK Plan).. విజయ్‌కు కీలకమైన సలహా ఇచ్చారట. హీరో విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఇటీవలే ఏర్పడింది. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అప్పటివరకు టీవీకేలోకి చేరికలను ప్రోత్సహించాలని, ఇతర పార్టీల ముఖ్యనేతలను వీలైనంత మేరకు ఆకర్షించాలని విజయ్‌కు పీకే సూచించారట. టీవీకేను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకున్నాక.. పొత్తుల విషయంలో కసరత్తు మొదలుపెట్టాలని ప్రశాంత్ కిశోర్ చెప్పారట. అసెంబ్లీ పోల్స్‌కు కనీసం ఆరు నెలల ముందు అన్నా డీఎంకే పార్టీతో, పొత్తుల అంశంపై చర్చలు జరిపితే  బాగుంటుందని విజయ్‌కు పీకే  తెలిపారట. ఒకవేళ ఇరుపార్టీల పొత్తు కుదిరితే.. ఎడప్పాడి పళనిసామికి సీఎం సీటు, విజయ్‌‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే షరతుపై కలిసి పనిచేస్తారని అంటున్నారు.

Also Read :MLA Quota MLCs: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. రేసులో కీలక నేతలు

ఓట్ల శాతం లెక్కలతో.. 

ప్రస్తుతం తమిళనాడులో అన్నా డీఎంకే పార్టీకి  దాదాపు 25 శాతం ఓట్లు ఉంటాయని, టీవీకే కనీసం 20 శాతం ఓట్లు తప్పకుండా సాధిస్తుందనే అంచనాతో పీకే ఉన్నారట. బీజేపీ సహా పలు ఇతర పార్టీలన్నీ కలిసి కనీసం 50 శాతం ఓట్లు ఈ కూటమికే దక్కుతాయని పీకే భావిస్తున్నారట. మొత్తం మీద ఏపీ తరహా కూటమిని తమిళనాడులోనూ ఏర్పాటు చేసేలా పీకే వ్యూహాన్ని రెడీ చేశారట. అయితే విజయ్ మొదటి నుంచీ బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. మత తత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. పొత్తు విషయంలో బీజేపీకి నో చెప్పే సాహసాన్ని అన్నా డీఎంకే చేస్తుందా ? బీజేపీ, టీవీకేలలో ఏ పార్టీకి అన్నా డీఎంకే ప్రయారిటీ ఇస్తుంది ? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. తమిళనాడు ప్రజలు మొదటి నుంచీ బీజేపీని పెద్దగా ఆదరించడం లేదు. బీజేపీతో జతకట్టే పార్టీలనూ తిరస్కరిస్తున్నారు. అందుకే తమిళనాడులో కూటమి రాజకీయాలు పెద్దగా సక్సెస్ కాకపోవచ్చు.