Site icon HashtagU Telugu

Bangalore: మళ్లీ దాడులు చేస్తాం… ఈసారి మా టార్గెట్ ఏంటో తెలుసా? ఉగ్రవాదుల హెచ్చరిక..!!

afghan blast

afghan blast

కర్నాటకలోని మంగళూరులో జరిగిన కుక్కర్ బాంబు పేలుడు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ పేలుడు తమ పనేనంటూ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ రెసిస్టెన్స్ కౌన్సిల్ హెచ్చరించింది. అయితే ఈ బాంబు పేలుడులో పోలీసులకు చిక్కిన ఉగ్రవాది సంచలన విషయాలను భయటపెట్టాడు. ఆర్ఎస్ఎస్ సంబంధిత సంస్థలు నిర్వహించే చిన్నారుల కార్యక్రమమే టార్గెట్ గా పేలుళ్లకు పాల్పడాలని మొదట ప్లాన్ చేసినా…చివరిలో మారిందంటూ చెప్పిన వ్యాఖ్యలు మరింత భయాందోళకు గురిచేశాయి. తాజాగా ఉగ్రవాద గ్రూపు చేసిన మరో వార్త ఇప్పుడు, దేశభద్రతకు కూడా పెనుప్రమాదం తెచ్చిపెట్టేహెచ్చరిక. మళ్లీ దాడులు చేస్తాం…సిద్ధంగా ఉండండి. అంటూ బెంగుళూరు పోలీసులకు ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ చేశారు.

మంగళూరు పేలుడు కేసులో అరెస్టు అయి పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి తమ సోదరుడని పేర్కొన్నారు. అసలు టార్గెట్ మంగళూరులోని కాద్రీలో ఉన్న ఓ దేవాలయం అని చెప్పడం మరింత సంచలనంగా మారింది. బీజేపీ ఉగ్రవాదులకు బెంగుళూరు కంచుకోటలా మారిందని ఆరోపించారు. తమ ప్రయత్నం విఫలమైనప్పటికీ..ఈసారి మాత్రం పక్కా ప్లాన్ తో దాడి చేస్తామని దానికి రెడీగా ఉండాలంటూ పోలీసులను హెచ్చరించారు.

అయితే దాడులకు పాల్పడేందుకు ప్లాన్ చేస్తున్న మా సోదరులను పట్టుకునేందుకు కేంద్ర రాష్ట్ర బలగాలు ప్రయత్నిస్తున్నాయని..భవిష్యతుల్లో భారీ దాడి మాత్రం తప్పదని హెచ్చరికలు జారీ చేశారు.

Exit mobile version