Annamalai : విజయసాయి రెడ్డి రాజీనామాతో ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం ఎవరికి దక్కబోతోంది ? అనే దానిపై క్లారిటీ వచ్చేసింది. దాన్ని తమిళనాడు బీజేపీ నేత అన్నామలైకే కేటాయిస్తామని కేంద్రహోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఇవాళ తనతో భేటీ అయిన ఏపీ సీఎం చంద్రబాబుకు దీనిపై సమాచారాన్ని ఇచ్చారు. అందుకు చంద్రబాబు కూడా అంగీకారం తెలిపారు. జనసే, టీడీపీ, బీజేపీ కూటమి తరఫున ఆ రాజ్యసభ సీటును అన్నామలైకు ఇచ్చేందుకు తాము సానుకూలమేనని చెప్పారు.
Also Read :Terror Attack: కశ్మీర్‌లో ఉగ్రదాడి.. 27 మంది టూరిస్టులు మృతి.. 20 మంది పరిస్థితి విషమం
తమిళనాడులో బీజేపీకి ప్లస్..
కూటమిలోని పార్టీలన్నీ ఉమ్మడి రాజకీయ ప్రయోజనాల కోసం కలిసికట్టుగా ముందుకు సాగుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. త్వరలోనే రాజ్యసభకు ఎన్నిక కానున్న అన్నామలైకు కేంద్ర మంత్రి పదవిని ఇవ్వాలని ప్రధాని మోడీ భావిస్తున్నారట. తద్వారా వచ్చే సంవత్సరం జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా బీజేపీకి మరింత మైలేజీని పెంచాలనే స్కెచ్‌తో మోడీ ఉన్నారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ చీఫ్ హోదాలో అన్నామలై(Annamalai) దాదాపు నాలుగేళ్ల పాటు సేవలు అందించారు. ఈ వ్యవధిలో ఆయన రాష్ట్రంలో బీజేపీ ఓట్ల శాతాన్ని 3 శాతం నుంచి 11 శాతానికి పెంచారు. అన్నామలైకు కేంద్ర మంత్రి పదవి దక్కితే.. తమిళనాడులో బీజేపీకి పడే ఓట్లు మరింతగా పెరుగుతున్నాయని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట.
Also Read :Chinas New Weapon: చైనా కొత్త బాంబు.. దడ పుట్టించే నిజాలు
పవన్, అన్నామలై ఫార్ములా..
గతంలో ఏపీ నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యులుగా వ్యవహరించిన సురేశ్ ప్రభుకు కూడా కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. గత ఎన్నికల టైంలో అన్నామలైకు మద్దతుగా నారా లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్నామలైకు రాజ్యసభ సీటు ఇస్తే.. భవిష్యత్తులో ఏపీ, తెలంగాణలో బీజేపీకి మేలు చేకూరుతుందని కమలదళం వర్గాలు ఆశిస్తున్నాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ సనాతన ధర్మం పేరుతో ఏపీలో కొత్త సమీకరణాలకు తెర లేపారు. ఏపీ నుంచి అన్నామలై రాజ్యసభకు వెళ్తే.. బీజేపీకి కొత్తరెక్కలు వచ్చినంత పని అవుతుంది. రానున్న కాలంలో పవన్ కల్యాణ్, అన్నామలై కలిసి.. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలకు ఊపిరులు ఊదుతారని అంచనా వేస్తున్నారు.