MP Suicide : సిట్టింగ్ లోక్‌సభ ఎంపీ సూసైడ్ చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో తనకు పార్టీ టికెట్ ఇవ్వలేదనే మనస్తాపంతో తమిళనాడులోని డీఎండీకే పార్టీ ఈరోడ్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ గణేశమూర్తి (77) కన్నుమూశారు. పురుగుమందు తాగి ఆదివారం (మార్చి 24న) ఆత్మహత్యాయత్నం చేసిన ఆయన కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ఐసీయూలో చికిత్సపొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించారు. హార్ట్ ఎటాక్ రావడం వల్ల గణేశమూర్తి(MP Suicide) మరణించారని ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. గణేశమూర్తి పార్థివదేహాన్ని పోలీసులకు అప్పగించింది. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టు (ఐఆర్టీ) మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. శవపరీక్ష తర్వాత మృతదేహాన్ని కుమారవలసు గ్రామానికి తీసుకెళ్లి ఖననం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
We’re now on WhatsApp. Click to Join
- గణేశమూర్తి 2019 సంవత్సరానికి ముందు రెండుసార్లు ఎంపీగా గెలిచారు.
- 1998లో పళని లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచారు.
- 2009లో ఈడోడ్ స్థానం నుంచి విజయం సాధించారు.
- 2019 లోక్‌సభ ఎన్నికల్లో మారుమలార్చి ద్రావిడ మున్నేత్ర కళగం (డీఎండీకే) తరఫున ఈరోడ్ నుంచి గణేశమూర్తి పోటీ చేసి గెలిచారు.
- ఈ ఎన్నికల్లోనూ పోటీచేయాలనుకున్న గణేశమూర్తికి డీఎండీకే అవకాశం ఇవ్వలేదు.
- గణేశమూర్తి భార్య చనిపోయారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.