Super Powers : ఆ కుర్రాడి వయసు 19 ఏళ్లు. మూఢనమ్మకాలతో లేనిది ఉన్నట్టుగా ఊహించుకున్నాడు. తనకు ఏవో సూపర్ పవర్స్ వచ్చాయని అనుకున్నాడు. ఆ సూపర్ పవర్స్‌ను టెస్ట్ చేసుకునేందుకు.. తాను చదువుతున్న ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్‌లోని నాలుగో అంతస్తు గోడ ఎక్కి దూకేశాడు. దీంతో ఆ కుర్రాడికి తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయాలపాలైన విద్యార్థి ప్రభును వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. విద్యార్థి ప్రభు(Super Powers) ‘కర్పగం ఇంజినీరింగ్ కాలేజీ’లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీరింగ్ కోర్సు మూడో సంవత్సరం చదువుతున్నట్లు గుర్తించారు. గోడ దూకడానికి ముందు ప్రభు.. తన స్నేహితులతో మాట్లాడినట్లు వెల్లడైంది. తనకు సూపర్ పవర్స్ వచ్చాయని.. ఇక గోడలు దూకినా ఏమీ కాదని అతడు ఫ్రెండ్స్‌కు చెప్పినట్టు సమాచారం.
Also Read :Balmoori Venkat : కేటీఆర్, కౌశిక్‌పై ఫైర్.. డ్రగ్స్ టెస్టుకు శాంపిల్స్ ఇచ్చిన అనిల్, బల్మూరి
విద్యార్థి ప్రభు గోడ దూకిన సీసీటీవీ ఫుటేజీ బయటికి వచ్చింది. నీలిరంగు చొక్కా ధరించిన ప్రభు.. హాస్టల్ నాలుగో అంతస్తులోని గది నుంచి బయటకు వచ్చి కారిడార్‌లోకి దూకడం అందులో స్పష్టంగా రికార్డయింది. కారిడార్‌లో నిలబడి ఉన్న ఇద్దరు విద్యార్థులు.. ప్రభు గోడ దూకడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. గోడ దూకడంతో ప్రభు చేయి, కాలు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాగా రక్తస్రావం అయింది. ఈ ఘటనపై చెట్టిపాళయం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read :Salman Khan : ‘2 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం’.. సల్మాన్‌కు మరోసారి హత్య బెదిరింపు
సూపర్ పవర్స్ గురించి అసలు ప్రభుకు ఆలోచన ఎందుకు మొదలైంది ? వాటి గురించి అతడు ఎక్కడ తెలుసుకున్నాడు ? అతడికి ఇతరులు ఎవరైనా ఈ అపోహలను కలిగించారా ? అనేది పోలీసుల విచారణలో తెలుస్తుంది. ఇటువంటి మూఢనమ్మకాలను తొలగించేలా విద్యాసంస్థల్లో ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు, యువతను చైతన్యవంతులుగా మార్చాల్సిన అవసరం ఉంది.