Underworld Don: ఎన్ ముత్తప్ప రాయ్.. ఒకప్పుడు కర్ణాటక రాష్ట్రంలో అండర్ వరల్డ్ డాన్. అతడు బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతూ 68 ఏళ్ల వయసులో 2020 మే నెలలో చనిపోయాడు. ముత్తప్ప రాయ్ కుమారుడు రిక్కీ రాయ్ కర్ణాటకలోని రామనగర పరిధి బిడది ఏరియాలో నివసిస్తున్నాడు. తాజాగా రిక్కీ రాయ్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. రిక్కీ ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం అర్థరాత్రి రిక్కీ తన కారులో బెంగళూరు నుంచి బిడదికి తిరిగి వచ్చాడు. అతడు వాహనంలో ఉండగానే కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఓ బుల్లెట్ రిక్కీ రాయ్ కారులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రిక్కీ, ఆయన డ్రైవరుకు బుల్లెట్ తాకి గాయాలయ్యాయి. ఈవివరాలను రామనగర ఎస్పీ శ్రీనివాస్ గౌడ మీడియాకు వెల్లడించారు.
Also Read :Aryabhata 50 Years : భారత్ తొలి ఉపగ్రహం ఆర్యభట్టకు 50 ఏళ్లు.. చారిత్రక విశేషాలివీ
ముత్తప్ప రాయ్.. డాన్ ఎలా అయ్యాడు ?
- ముత్తప్ప రాయ్ విజయ బ్యాంకులో(Underworld Don) క్లర్కుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు.
- బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్డులో క్యాబరే పేరుతో బార్‌ను ప్రారంభించాడు.
- స్థానిక గూండాల నుంచి తన బార్‌ను రక్షించుకోవడానికి సొంతంగా ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.
- ఆ గ్యాంగ్ అండతోనే ముత్తప్ప రాయ్ అండర్ వరల్డ్ డాన్‌గా ఎదిగాడు.
- 1989లో రాయ్ తన అనుచరులతో కలిసి గ్యాంగ్‌స్టర్ ఎంపీ జయరాజ్‌పై దాడి చేసి చంపాడు.
- ముత్తప్ప రాయ్‌కు ముంబై అండర్ వరల్డ్‌తోనూ లింకులు ఉండేవట.
- సుపారీ హత్యలు చేయించేందుకు.. ముంబై అండర్ వరల్డ్ నుంచి షార్ప్ షూటర్లను ముత్తప్ప రాయ్ బెంగళూరుకు పిలిపించుకునే వాడట.
Also Read : Naxal Free Village: మావోయిస్టురహితంగా ‘బడేసట్టి’.. ఛత్తీస్‌గఢ్‌లో కీలక పరిణామం
ఈ హత్య తర్వాతే.. డాన్ అయ్యాడు
కర్ణాటకలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ జయరాజ్ 1989లో అంబాసిడర్ కారులో వెళ్తుండగా.. ముంబై షార్ప్ షూటర్లతో ముత్తప్ప రాయ్ ఎటాక్ చేయించాడు. బెంగళూరులోని లాల్ బాఘ్ వద్ద ఈ దాడి జరిగింది. జయరాజ్ కారులోకి బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. అవి తొలుత ఆ కారులో ఉన్న జయరాజ్ లాయర్ వర్ధమాన్యను తాకాయి. దీంతో వర్ధమాన్య చనిపోయాడు. ఆ తర్వాత వర్ధమాన్య డెడ్ బాడీని అడ్డంపెట్టుకొని ప్రాణాలు కాపాడుకునేందుకు జయరాజ్ యత్నించాడు. ఈక్రమంలో వర్ధమాన్య శరీరాన్ని చీల్చుకుంటే బుల్లెట్లు దూసుకెళ్లి జయరాజ్‌ను తాకాయి. దీంతో జయరాజ్ కూడా చనిపోయాడు. పట్టపగలే జరిగిన ఈ మర్డర్ తర్వాత కర్ణాటకలో అండర్ వరల్డ్ డాన్‌గా ముత్తప్పరాయ్ అవతరించాడు.