Auto Ride: బెంగళూరులో బాదుడే బాదుడు.. 500 మీట‌ర్లకే రూ.100 వసూలు చేసిన ఆటో డ్రైవర్

ట్రాఫిక్ ఎక్కువగా ఉండే పీక్ అవర్స్‌లో అయితే సిటీల్లో ఆటోలు, క్యాబ్‌ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Autos Imresizer

Autos Imresizer

బెంగళూరు విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒకవైపు మహిళలకు ఉచిత బస్సుల సర్వీస్ సదుపాయం పొందుతుండగా, మరోవైపు ఆటో డ్రైవర్లు రెచ్చిపోయి డబ్బులు గుంజుతున్నారు. ఈ నేపథ్యంలో న్యూరల్ గ్యారేజ్ కో ఫౌండర్ కం సీఈఓ మందార్ నటేకర్ కు బెంగళూరులో చేదు అనుభవం ఎదురైంది.  ఈ సందర్భంగా ఆటోలో ఏర్పాటు చేసిన మీటర్ ఫొటో కూడా పోస్ట్ చేశారు. ‘ఇది చాలా గొప్ప ఆటో మీటర్. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది కనుక దాన్ని ఆటో డ్రైవర్లు ఎప్పుడూ వినియోగించరు. కానీ నేను 500 మీటర్ల ప్రయాణానికి రూ.100 పే చేశా.. ముంబైలో ఇదే దూరానికి రూ.9 చెల్లిస్తే సరిపోతుంది` అని ట్వీట్ చేశారు.

బెంగళూరు మాత్రమే కాదు ముంబై నగర శివారుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందంటూ టీవీఎఫ్ ప్రెసిడెంట్ విజయ్ కోషి పోస్ట్ చేశారు. ఎవరూ పట్టించుకోనందువల్లే ఈ తరహా దోపిడీని ఎవరూ అడ్డుకోవడం లేదని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విషయం తెలుసుకున్న నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

గతంలోనూ ఇలాగే

ట్రాఫిక్ ఎక్కువగా ఉండే పీక్ అవర్స్‌లో అయితే సిటీల్లో ఆటోలు, క్యాబ్‌ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎంతలా అంటే.. రెండు కిలోమీటర్ల ఆటో ప్రయాణానికి రూ.300 వసూలు చేసేంత. ఏంటి.. రెండు కిలోమీటర్లు ఆటోలో వెళ్లడానికి మూడొందల రూపాయలా..? అని ఆశ్చర్యపోతున్నారా..? నిజమే.. బెంగళూరుకు చెందిన రవి సుతంజని అనే వ్యక్తి రెండు కి.మీ. ఆటోలో వెళ్లడానికి రూ.300 చెల్లించానని చెప్పాడు. మీ నగరంలో సాధారణంగా రేట్లు ఎలా ఉంటాయని ట్విట్టర్ వేదికగా తోటి నెటిజన్లను ప్రశ్నించాడు. రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సింది కదా.. రూ.300 అంటే చాలా ఎక్కువ చెల్లించారని నెటిజన్లు సమాధానం ఇచ్చారు. దీనికి రవి స్పందిస్తూ.. నేను గత ఆరు నెలలుగా రోజుకు సగటున 4 కిలోమీటర్లు నడుస్తున్నా, నడవడంలో ఇబ్బందేమీ లేదు గానీ.. అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చింది అందుకే నడవడం కుదర్లేదన్నాడు.

Also Read: TS High Court: హైకోర్టు సంచలన తీర్పు, కొత్తగూడెం ఎమ్మెల్యే పై అనర్హత వేటు

  Last Updated: 25 Jul 2023, 12:54 PM IST