కర్ణాటక రాజకీయాల్లో (Karnataka Politics) కీలక మార్పులకు దారితీసే వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(State Deputy CM DK Shivakumar)కు అత్యంత సన్నిహితుడిగా భావించే ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. “శివకుమార్‌కు సీఎం పదవి దక్కడం సమయం విషయమే. హైకమాండ్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది. వచ్చే మూడు నెలల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి. సెప్టెంబర్ తర్వాత స్పష్టత వస్తుంది” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్‌పై ఊహాగానాలకు దారితీశాయి.
MP Raghunandan Rao : నిన్ను లేపేస్తాం అంటూ ఎంపీ రఘునందన్ కు మావోలు హెచ్చరిక
ఈ వ్యాఖ్యలతో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా మారే అవకాశాలపై పునరాలోచనలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ హైకమాండ్ ముందుగానే సిద్ధరామయ్యకు పూర్తిస్థాయి గల మద్దతును ప్రకటించినప్పటికీ, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శివకుమార్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. అయితే కాలక్రమేణా శివకుమార్ వర్గం సీఎం మార్పు అంశాన్ని తిరిగి తెరపైకి తీసుకురావడం గమనార్హం. దీనికి తోడు సెప్టెంబర్ తర్వాత నిర్ణయం ఉంటుందని ఎమ్మెల్యే చెప్పడం రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది.
అయితే ఈ వార్తలపై సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సీరియస్‌గా స్పందించారు. “ఇవి పూర్తిగా ఊహాగానాలు. ఇప్పటి వరకు ఈ విషయంలో హైకమాండ్ నుంచి ఎలాంటి సంకేతాలు లేవు. మా సీఎం గారే పూర్తి కాలం పాలన చేస్తారు” అని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ వర్గాల మధ్య అంతర్గత విభేదాలు మళ్లీ బయటపడుతున్నాయా? అనే చర్చ జరుగుతోంది. అయినప్పటికీ, హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.