Site icon HashtagU Telugu

Shashi Tharoor : బీజేపీలోకి శశిథరూర్ ? మోడీ వ్యాఖ్యలకు అర్థం అదేనా?

Shashi Tharoor Kerala Bjp Pm Modi Kerala Politics Congress Bjp Kerala

Shashi Tharoor : కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం జరగబోతోందా ?  కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ బీజేపీలోకి జంప్ కాబోతున్నారా ? ప్రధాని మోడీ శుక్రవారం రోజు చేసిన వ్యాఖ్యలకు అర్థం అదేనా ?  అనే కోణంలో ఇప్పుడు చర్చ మొదలైంది. దీనిపై ఓసారి లోతుగా వెళ్దాం..

Also Read :Janulyri : ఆత్మహత్య చేసుకుంటానంటూ జాను కన్నీరు..అసలు ఏంజరిగిందంటే !!

శుక్రవారం రోజు ఏం జరిగింది ? 

మోడీ మాటలకు అర్థం ఏమిటి ? 

కేరళ బీజేపీకి సారథిగా చేస్తారా ?

గత లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీ ఒక సీటు గెల్చుకుంది. అయితే అనూహ్యంగా బీజేపీ 19.24 శాతం ఓట్లను సాధించింది. యూడీఎఫ్ కూటమి 18 సీట్లు, ఎల్‌డీఎఫ్ కూటమి 1 సీటు గెల్చుకున్నాయి. గత ఎన్నికల సమయంలో కేరళలో బీజేపీకి మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సారథ్యం వహించారు. తిరువనంతపురం లోక్‌సభ స్థానంలో స్వయంగా  రాజీవ్ చంద్రశేఖర్  పోటీచేసినప్పటికీ.. విజయం మాత్రం కాంగ్రెస్  నేత శశిథరూర్‌నే వరించింది. ఆయన నాలుగోసారి ఎంపీ అయ్యారు. ఈనేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో వీలైనన్ని ఎక్కువ సీట్లను గెల్చుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. అక్కడ పార్టీని నడిపే బలమైన నేత కోసం కమలదళం పెద్దలు వెతుకుతున్నారు. శశిథరూర్ రూపంలో ఆ నాయకుడు దొరికాడని అంటున్నారు. కేరళలో మతపరమైన రాజకీయాలు అంతగా నడవవు.  శశిథరూర్ లాంటి సెక్యులర్ లీడర్‌ ద్వారా కేరళ ప్రజలకు బీజేపీని చేరువ చేయొచ్చని మోడీ భావిస్తున్నారు.

Also Read :Aadhaar Camps: ఏపీలో ఈనెల 5 నుంచి చిన్నారుల కోసం ఆధార్ ప్రత్యేక శిబిరాలు

శశి థరూర్ నిర్ణయం అదేనా ? 

వాస్తవానికి గత రెండేళ్లుగా శశిథరూర్‌(Shashi Tharoor)కు, కాంగ్రెస్ అగ్రనేతలతో గ్యాప్ పెరిగింది. కేరళ సీఎం పినరయి విజయన్ స‌ర్కారు తీసుకొచ్చిన  ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్, రెడ్‌ టేప్‌ కోత విధానాలపై కొద్ది రోజుల క్రితం శ‌శిథ‌రూర్ ప్ర‌శంసలు కురిపించారు. గత రెండేళ్లలో చాలాసందర్భాల్లో కాంగ్రెస్‌కు బద్ధ శత్రువైన ప్రధాని మోడీని ప్రశంసిస్తూ  థరూర్ ట్వీట్లు చేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వం ఆలోచన బాగానే ఉందని కితాబిచ్చారు. ప్రధాని మోడీ అమెరికా పర్యటన, డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీలపై థరూర్ పాజిటివ్ కామెంట్స్ చేశారు. ఇవన్నీ గమనించిన కాంగ్రెస్ హైకమాండ్.. శ‌శిథ‌రూర్‌ను పక్కన పెట్టడం మొదలుపెట్టింది. థరూర్ మనసులో జంపయ్యే ఆలోచన ఉండొచ్చనే అనుమానంతోనే ఆయనకు పార్టీలో ప్రయారిటీ తగ్గించింది. చివరకు కేరళ రాష్ట్ర కాంగ్రెస్‌లోనూ థరూర్‌కు ప్రాధాన్యతను తగ్గించారు.  ‘‘కాంగ్రెస్ పార్టీకి నా అవ‌స‌రం లేక‌పోతే స్ప‌ష్టంగా చెప్పాలి. నా దారి నేను చూసుకుంటాను’’ అని గ‌త ఫిబ్ర‌వ‌రిలో పార్టీ అధిష్టానాన్ని థరూర్ బహిరంగంగా అడిగారు. ఈ నేప‌థ్యంలో థరూర్ వచ్చే ఎన్నికల నాటికి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.