తిరుమల లడ్డు అపవిత్రమైన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రాయశ్చిత్త దీక్ష (Prayaschitta Diksha) చేపట్టిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 02 తో ఈ దీక్ష పూర్తి అవుతుంది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్ష పై NTK పార్టీ (Naam Tamilar Katchi) అధినేత సీమాన్ (Seeman) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ బరువు తగ్గేందుకే దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశాడు.
తిరుమల లడ్డు వివాదం (Tirumala Laddu Controversy) ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై హిందువులే కాదు..రాజకీయ పార్టీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ..కఠిన శిక్షలు విధించాలని కోరుతున్నారు. గత వైసీపీ (YCP) ప్రభుత్వంలో తిరుమల లడ్డు అపవిత్రమైందని, ఎంతో శ్రేష్టమైన ఆవునెయ్యి తో చేయాల్సిన లడ్డును..గత ప్రభుత్వం జంతువుల కొవ్వుతో చేసారని సాక్ష్యాత్తు సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆరోపించడం తో దేశ వ్యాప్తంగా దీనిపై ఆగ్రహపు జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దీనిపై గత ప్రభుత్వం సీఎం , వైసీపీ అధినేత జగన్ , మాజీ TTD చైర్మన్ తదితరులు స్పందించారు. తమ హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని ..కావాలనే చంద్రబాబు ఇలా కామెంట్స్ చేసి హిందువుల మనుభవాలు దెబ్బతీస్తున్నారని వాపోయారు. ప్రస్తుతం దీనిపై చర్చ నడుస్తుంది.
ఈ లడ్డూ వివాదంపై NTK పార్టీ (Naam Tamilar Katchi) అధినేత సీమాన్ (Seeman) రీసెంట్ గా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అందరిలో ఆగ్రహపు జ్వాలలు నింపారు. ‘లడ్డూ తప్ప దేశంలో ఇంక ఏ సమస్యలు లేవా..? కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా..? కల్తీ జరిగితే చర్యలు తీసుకోండి. అంతేకాని లడ్డూ, బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు” అంటూ వారు చేసిన కామెంట్స్ పై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేయగా..ఆ వ్యాఖ్యల గురించి ఇంకా చర్చ జరుగుతుండగానే తాజాగా పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసి జనసేన శ్రేణుల్లో , అభిమానుల్లో ఆగ్రహం నింపారు.
పవన్ కళ్యాణ్ బరువు తగ్గేందుకే దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎంగా ఉండి లడ్డూపై రాజకీయాలు తగవన్నారు. లడ్డూపై కార్తీ చేసిన కామెంట్లలో ఎలాంటి తప్పూ లేదని, సినిమాలు అడ్డుకుంటారనే భయంతోనే ఆయన క్షమాపణ చెప్పారని పేర్కొన్నారు. ప్రస్తుతం సిమన్ చేసిన వ్యాఖ్యలపై అంత మండిపడుతున్నారు.
Read Also : Myopia : ప్రపంచంలోని ప్రతి మూడవ బిడ్డకు మయోపియా ఉంది, దాని కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?