CM Siddaramaiah : ఇవాళ బెంగళూరులోని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రజాస్వామ్య దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా పాల్గొన్నారు. అయితే ఆయన సెక్యూరిటీ ప్రొటోకాల్‌లో భద్రతాలోపం చోటుచేసుకుంది. ఓ గుర్తుతెలియని వ్యక్తి అకస్మాత్తుగా స్టేజీపైకి ఎక్కేందుకు యత్నించాడు. సీఎం సిద్ధరామయ్య కూర్చున్న సీటు వైపుగా అతడు దూసుకెళ్తుండగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. సదరు వ్యక్తిని స్టేజీ పైనుంచి కిందికి పంపించారు. అతడిని పోలీసులు విచారించగా.. పేరు మహదేవ్ నాయక్ అని వెల్లడించాడు.
Also Read :Engineers Day 2024 : ఇవాళ ఇంజినీర్స్ డే.. ది గ్రేట్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత విశేషాలివీ
సీఎం సిద్ధరామయ్యకు పూలమాల వేసేందుకు మాత్రమే తాను స్టేజీపైకి ఎక్కానని అతడు చెప్పాడు. అయితే సీఎం భద్రతా ప్రొటోకాల్‌ను ఉల్లంఘించినందుకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అవసరమైన పాస్, ఐడెంటిటీ కార్డు అన్నీ మహదేవ్ నాయక్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. సదరు వ్యక్తి స్టేజీపైకి దూసుకొస్తున్నా కుర్చీ పైనుంచి సిద్ధరామయ్య(CM Siddaramaiah) కదలలేదు. ఆయన అక్కడే కూర్చున్నారు.
Also Read :Kejriwal Resignation : రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా : సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఇటీవలే సీఎం సీటు విషయంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరో ఆక్రమించుకోవడానికి సీఎం సీటు ఖాళీగా లేదన్నారు. ‘‘సీఎం పదవి ఖాళీగా ఉందని ఇప్పటిదాకా ఎవరూ చెప్పలేదు. పదవే ఖాళీగా లేనప్పుడు కొత్తగా ఎవరు ముఖ్యమంత్రి అవుతారు’’ అని ఆయన ప్రశ్నించారు. తానే సీఎంగా కొనసాగుతానని తేల్చి చెప్పారు. సీఎం ఎవరు అనే దానిపై ఎవరికీ డౌట్స్ ఉండాల్సిన అవసరం లేదన్నారు. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా)కు సంబంధించిన దాదాపు 14 స్థలాలను భార్యకు సీఎం సిద్ధరామయ్య కేటాయించుకున్నారనే అభియోగాలు ఉన్నాయి. ఈ విచారణను ఎదుర్కొనేందు కోసం ఆయన సీఎం పదవి నుంచి తప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అందువల్లే సీఎం సీటు విషయంలో సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.