Site icon HashtagU Telugu

Wrestlers Protest: పదేళ్లుగా మహిళ రెజ్లర్లపై లైగిక వేధింపులు: వైరల్ వీడియో

Wrestlers Protest

New Web Story Copy 2023 06 17t191551.810

Wrestlers Protest: తమపై జరిగిన లైంగిక వేధింపులపై ఓ వీడియోను విడుదల చేశారు రెజ్లర్ సాక్షి మాలిక్. ఈ వీడియోలో ఆమెతో పాటు భర్త సత్యవ్రత్ కడియన్ కూడా ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో సెన్సేషన్గా మారింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, రెజ్లర్ సాక్షి మాలిక్ లైంగిక వేధింపుల కేసు దేశంలో చర్చనీయాంశంగా మారింది.

గత కొన్నేళ్లుగా రెజ్లింగ్ ఫెడరేషన్‌లో మహిళా రెజ్లర్లు లైంగికంగా దోపిడీకి గురవుతున్నారని వారు ఆరోపించారు. లైంగిక ఆరోపణలపై తాను జరుపుతున్న ఉద్యమం రాజకీయ ప్రేరేపితమైనది కాదని అన్నారు. గత 10-12 ఏళ్లుగా మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, ఈ విషయం రెజ్లింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు తెలుసునని స్పష్టం చేశారు. . ఎవరైనా గళం విప్పితే ఈ విషయం రెజ్లింగ్ ఫెడరేషన్‌కి తెలిస్తే వాళ్ళ కెరీర్ కి ప్రమాదంగా మారేదని అన్నారు. ఈ విషయంలో తమ నిరసన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని, రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకమని చెప్పారు. ఎందుకంటే అతను పదవిలో ఉన్నప్పుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సాక్షి మాలిక్ మరియు ఆమె భర్త వీడియోలో పంచుకున్నారు.

https://twitter.com/SakshiMalik/status/1670008378725220352?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1670008378725220352%7Ctwgr%5E646eef3b18d82796cf64fce5d9bb1018e9d910de%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.jagran.com%2Fdelhi%2Fnew-delhi-city-ncr-sakshi-malik-shared-video-on-twitter-big-allegation-controversy-wfi-chief-brij-bhushan-sharan-singh-physically-harassment-of-female-wrestlers-23444220.html

రెజ్లర్ల మధ్య ఐక్యత లేకపోవడం వల్లే తాను ఇప్పటి వరకు మౌనంగా ఉన్నానని సాక్షి మాలిక్ అన్నారు. రెజ్లింగ్ ఆడే వారు చాలా పేద కుటుంబాల నుండి వచ్చినవారు. అందుకే లైంగిక వేధింపుల కేసుల్లో గొంతు ఎత్తే ధైర్యం వారికి లేదు. మే 28న మాతో దారుణంగా ప్రవర్తించారు. దీనిపై మేము రాజ్యాంగం పరిధిలోనే నిరసన తెలిపామని తెలిపారు.

Read More: RS 1 Biryani: రూ.1కే చికెన్ ధమ్ బిర్యానీ

Exit mobile version