Rishi Sunak : రిషి సునాక్.. నిన్న మొన్నటి వరకు బ్రిటన్ ప్రధానమంత్రిగా నిత్యం బిజీగా ఉండేవారు. ఆ పదవి నుంచి తప్పుకున్నప్పటి నుంచి ఆయన చాలా ఫ్రీగా ఉంటున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని జయనగర్ ఏరియాలో తన అత్తవారింటిలోనే రిషి ఉన్నారు. ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడే.. రిషి సునాక్. తన భార్య అక్షతామూర్తితో కలిసి బెంగళూరు సిటీలో రిషి చాలా సింపుల్‌గా చక్కర్లు కొడుతున్నారు. ఈక్రమంలో ఆ దంపతులు కలిసి ‘థర్డ్ వేవ్ కాఫీ’ అనే కాఫీ షాపులోకి వెళ్లారు. అక్కడున్న వారు రిషి దంపతుల వద్దకు చేరుకొని సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. వారందరికీ తమతో సెల్ఫీ దిగే అవకాశాన్ని రిషి దంపతులు ఇచ్చారు. ఆ కాఫీ షాపులో టేబుల్స్‌పై కూర్చొని హాయిగా కాఫీ తాగుతూ వీరు కెమెరాకు చిక్కారు. రిషి బ్రిటన్ ప్రధానమంత్రిగా(Rishi Sunak) ఉన్న టైంలో అక్షతా మూర్తి చాలా సింపుల్‌గా బెంగళూరు వీధుల్లో తన తండ్రితో కలిసి షాపింగ్ చేశారు.
Also Read :Mother Kidnapped : కొడుకు అప్పు తీర్చడం లేదని.. తల్లిని కిడ్నాప్ చేసిన కాంట్రాక్టర్
ఇక బుధవారం రోజు రిషి దంపతులు, నారాయణమూర్తి దంపతులు కలిసి నంజన్‌గూడ రాఘవేంద్ర మఠాన్ని సందర్శించారు. ఆ టైంలో రిషి దంపతులతో పాటు వారి ఇద్దరు కుమార్తెలు అనౌష్క, కృష్ణ కూడా ఉన్నారు. నారాయణ మూర్తి విఖ్యాత ఇన్ఫోసిస్ కంపెనీకి అధిపతి. రిషి సునాక్.. బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి. అయినా వీరు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ప్రజల మధ్య నిర్భయంగా తిరగడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాగా, రిషి సునాక్ 2022 నుంచి 2024 వరకు బ్రిటన్ ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఇటీవలే జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో ఆయన ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీ ఓడిపోయింది. ఇక రిషి సునాక్ అత్తయ్య సుధామూర్తి ప్రస్తుతం భారత రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.