Maharashtra: మహారాష్ట్రలో (Maharashtra) ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ 35 వారాల గర్భవతి అని సాధారణ స్కానింగ్ సమయంలో ఆమె కడుపులో పెరుగుతున్న శిశువు కడుపులో పిండం ఉన్నట్లు గుర్తించారు. ఇటువంటి కేసులు చాలా అరుదుగా జరుగుతాయి. కడుపులో బిడ్డ ఎదుగుదలకు సంబంధించి ఇప్పటికే షాకింగ్ ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. 32 ఏళ్ల గర్భిణిది బుల్దానా జిల్లా. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది చాలా అరుదైన కేసు అని చెబుతున్నారు.
వాస్తవానికి 35 వారాల గర్భిణి తన రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చింది. అప్పుడే ఆ మహిళకు ఈ విషయం తెలిసింది. మహిళ సోనోగ్రఫీ పూర్తి చేశారు. నివేదిక వచ్చిన తర్వాత శిశువు కడుపు లోపల ఏదో ఉందని వైద్యులు గుర్తించారు. అనంతరం పరిశీలించగా.. కడుపులో పెరుగుతున్న శిశువు లోపల పిండం ఉన్నట్లు తేలింది. NBT నివేదిక ప్రకారం.. అదే ఆసుపత్రికి చెందిన ప్రసూతి, గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ అగర్వాల్ దీనిని ఫీటస్ ఇన్ ఫీటస్ అని అరుదైన కేసుగా అభివర్ణించారు.
Also Read: Bangladesh: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు బంగ్లాదేశ్‌కు ఊహించని షాక్!
5 లక్షల మంది మహిళల్లో ఒక్కరికి ఇలా
5 లక్షల మంది గర్భిణుల్లో ఒకరికి ఇలా జరుగుతుందని డాక్టర్ చెప్పారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా డెలివరీ తర్వాత ఇలాంటివి దాదాపు 200 కేసులు నమోదయ్యాయన్నారు. భారతదేశంలో ఇప్పటివరకు 10-15 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వైద్యుల ప్రకారం ఇటువంటి కేసులు చాలా అరుదుగా మొదట్లోనే గుర్తించవచ్చు. ఇటువంటి కేసులు డెలివరీ తర్వాత మాత్రమే గుర్తిస్తారని కూడా తెలిపారు.
అయితే ప్రస్తుతం మహిళ ఆరోగ్యం సాధారణంగానే ఉందని వైద్యలు తెలిపారు. అయితే సదరు మహిళకు నార్మల్ డెలివరీ అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. పుట్టిన వెంటనే బిడ్డకు సరైన చికిత్స అవసరమని కూడా వెల్లడించారు. అయితే శిశువు కడుపులో పిండం ఏర్పడటానికి గల సరైన కారణాలను వైద్యులు కనుగోనలేకపోయినట్లు తెలుస్తోంది.