Operation Sindoor : పహల్గాం ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లలో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. దీనిపై దక్షిణాదిలోని సినిమా స్టార్లు, ప్రముఖులు స్పందించారు. భారత ఆర్మీకి తమ సంఘీభావం ప్రకటించారు. భారత ఆర్మీ సాహసోపేత ఆపరేషన్‌ను కొనియాడారు. పాకిస్తాన్ ఉగ్రమూకలకు తగిన సమాధానం చెప్పారని పేర్కొన్నారు.
Also Read :India Attack : పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడి.. భారత్ వాడిన ఆయుధాలివే!
మూవీ స్టార్లు, ప్రముఖుల స్పందన ఇదీ..
- ‘‘జై హింద్.. ఆపరేషన్ సింధూర్’’ అని చిరంజీవి(Operation Sindoor) పేర్కొన్నారు.
- ‘‘ఆపరేషన్ సిందూర్‌లో భాగమైన మన భారత సైన్యం భద్రత, బలం కోసం ప్రార్థిస్తున్నాను.. జైహింద్’’ అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు.
- ‘‘జై హింద్.. భారత్ మాతాకీ జై..’’ అని రితేశ్ దేశ్‌ముఖ్ తెలిపారు.
- ‘‘న్యాయం జరగాలి.. జై హింద్.. ఆపరేషన్ సిందూర్’’ అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
- ‘‘మన నిజమైన హీరోలకు సెల్యూట్… దేశం ఆపదలో ఉంటే ఇండియన్ ఆర్మీ స్పందన ఎలా ఉంటుందో ఆపరేషన్ సిందూర్‌తో మరోసారి నిరూపితమైంది. మీరు దేశాన్ని గర్వపడేలా చేస్తున్నారు. జై హింద్’’ అని మోహన్‌లాల్ తెలిపారు.
- ‘‘భారత సైన్యం భద్రతా కార్యకలాపాలకు రాయల్ సెల్యూట్..’’ అని విజయ్ దళపతి చెప్పారు.
- ‘‘ధర్మో రక్షతి రక్షితః.. జైహింద్ కి సేనా’’ అని వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు.
- ‘‘భారత్ మాతా కీ జై.. సరైన న్యాయం జరిగింది’’ అని ఖుష్బూ వ్యాఖ్యానించారు.
Also Read :Operation Sindoor : మసూద్ అజార్ ఫ్యామిలీలో 10 మంది హతం
- ‘‘అసలైన యోధుడి యుద్ధం ఇప్పుడు ప్రారంభమవుతుంది. లక్ష్యం నెరవేరే వరకు ఆగదు! దేశం మొత్తం మీతోనే ఉంది’’ అని పేర్కొంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఆయన PMO, హోం మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేశారు.
- ప్రముఖ దక్షిణ భారత నటి కాజల్ అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో.. ‘‘భారత్ మాతా కీ జై.. మేం భారత సైన్యంతో సంఘీభావంగా నిలుస్తాం’’ అని రాశారు. ఈ సవాలుతో కూడిన సమయంలో భారతదేశంలోని ప్రతి పౌరుడు ఐక్యంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. భారత సాయుధ దళాలకు మద్దతుగా నిలవాలని సూచించారు. దేశం యొక్క నిర్ణయాలను విశ్వసించాలని కోరారు. ఐక్యతే మన బలం అని కాజల్ చెప్పారు.