T20 World Cup: టీమ్ ఇండియా పై అద్భుతమైన విశ్లేషణ చేసి గెలవడానికి సీక్రెట్స్ చెప్పిన పొలిటీషియన్

ఎన్నికల కోసం విసురుకున్న సవాళ్లు, ప్రజలు తమనే గెలిపిస్తారని నమ్మకాలు, నియోజకవర్గంలో తమ జెండానే ఎగురుతుందనే ఆశలు ముగిసాయి. ఇక తేలాల్సింది ఫలితాలే.

  • Written By:
  • Updated On - November 1, 2021 / 09:18 PM IST

ఐపీఎల్ లో టీమ్ ఇండియా వరసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో క్రికెట్ అభిమానులు ప్లేయర్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాజీఎంపీ హర్షకుమార్ కూడా దీనిపై ఘాటుగా స్పదించారు.

బీసీసీఐ కి ప్రెసిడెంట్ గా సౌరవ్ గంగూలీ, సెక్రటరీగా క్రికెట్ కి సంబంధం లేని అమిత్ షా కొడుకు జై షా అయిన తర్వాత ఇండియన్ క్రికెట్ పతనం ప్రారంభమైందని హర్ష కుమార్ పేర్కొన్నారు.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో జట్టు కూర్పులో లోపం వల్ల ఓడిపోయామని, అంతకు ముందు ఆస్ట్రేలియా లో గాయంతో అద్భుతంగా ఆడిన హనుమ విహారి ని పక్కన పెట్టడం వలన దెబ్బతిన్నామని ఆయన తెలిపారు.

తెలుగు ప్లేయర్లపై కావాలని వివక్ష చూపుతున్నారని హర్షకుమార్ విమర్శించారు. హనుమవిహారిది బొంబాయి గాని ఢిల్లీ గాని అయితే ఆయన్ని పక్కన పెట్టేవారు కాదని, అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించిన అంబటి రాయుడుని ఆంధ్ర వాడనే పక్కన పెట్టారని ఆయన తెలిపారు.

ఇప్పుడు టీ 20 ఐసీసీ ప్రపంచ కప్ పోటీలో శిఖర్ ధావన్ ను పక్కన పెట్టడం వల్ల ఈ దుర్గతి పట్టిందని హర్షకుమార్ తెలిపారు.

మొన్నటి మ్యాచుల్లో బాల్ ని లాఫ్ట్ చెయ్యడం వలనే ఇంచుమించు అందరూ ఔట్ అయ్యారని, అలా కాకుండా డ్రైవ్స్ కొట్టే బ్యాట్స్మెన్స్ గల్ఫ్ లోని పిచ్ లకు సరిపోతారని తెలిపారు.

పాకిస్తాన్ తో మ్యాచ్ లో పూర్తిగా బౌలింగ్ లో ఉన్న లోపం వల్ల ఒడిపోయామని,న్యూజిలాండ్
మనకన్నా ఎక్కువ రన్స్ చేయలేకపోయేదని కానీ వాళ్ళ బౌలింగ్ ఇచ్చిన ఫైట్ మనం ఇవ్వలేక పోయామని, మనవాళ్ళకి ప్లానింగ్ లేదని, న్యూజీలాండ్ వాళ్ళు మన వాళ్ళని పర్ఫెక్స్ట్ ప్లానింగ్ తో బౌల్ చేసి అవుట్ చేసారని తెలిపారు.

మన వాళ్ళు షాట్స్ కొడితే ఒక రన్ కన్నా ఎక్కువ రాని పరిస్థితి ఉండేనని, మన బౌలింగ్ లో వాళ్ళు కొట్టిన షాట్స్ అన్ని ఫీల్డర్స్ మధ్యనుంచి కొట్టినవేనని, దీనివల్ల మన బౌలర్ల కు కెప్టెన్ కు ఫీల్డర్స్ కు సమన్వయం లేదన్నది స్పష్టంగా కనపడిందని హర్ష కుమార్ అన్నారు.

ఇప్పటికైనా వీలుంటే శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, పటేల్, దీపక్, అశ్విన్లను ఫైనల్ లెవెన్ లో ఆడిస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇప్పటి వరకు సెకండ్ బాటింగ్ చేసిన టీమ్స్ గెలిచాయని,
మనకు టాస్ విషయంలో లక్ కలిసి రాలేదని చెప్పిన ఆయన
ధోని ని మెంటర్ గా పెట్టడం తప్పుని, కెప్టెన్ పూర్తి స్వేచ్ఛతో కెప్టెన్ ఉండాలని, రాహుల్ ని తప్పించి శేఖర్ ధావన్ ను వెంటనే తీసుకొని ఈ మార్పులతో ఆడితే ఖచ్చితంగా బాగుంటుందని ఆయన అన్నారు.

అశ్విన్ రైట్ ఆర్మ్ స్పిన్నర్, అక్షర్ పటేల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వీరిద్దరితో ఆడిస్తే డెఫినెట్ గా లాభం ఉంటుందని, అలాగే చహర్, బుమ్రా, షమీ కాంబినేషన్ బాగుంటుందని మాజీ ఎంపీ అభిప్రాయపడ్డారు. చహర్ వేరే కంట్రీస్ కి అలవాటు లేని బౌలర్. హార్దిక్ పాండ్య ఫైల్ అవుతున్నాడు కాబట్టి శ్రేయస్ అయ్యర్ బెటర్ అని, టీమ్ లో శేఖర్ ధావన్, రోహిత్ శర్మ, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లేదా కే ఎల్.రాహుల్, పంత్, ఇషాన్ కిషన్ లేదా సూర్యకుమార్ యాదవ్, పటేల్ , అశ్విన్, చహర్,షమీ,బుమ్రా ఉంటే
కాబట్టి బీసీసీఐ పై విధంగా ఆలోచించాలని అభ్యర్థించారు.

ttps://twitter.com/ShefVaidya/status/1454993398205612032