Viral : ఆటో డ్రైవర్ ఐడియా కు ఫిదా అవుతున్న నెటిజన్లు..

తమిళనాడుకు చెందిన ఓ డ్రైవర్ ఆలోచించి ఓ పెద్ద పైపును (Pipe) తన ఆటోకు అమర్చాడు. ఆ పైపు ముందు భాగాన్ని బయటకు పెట్టి, చివరి భాగాన్ని తను కూర్చునే సీట్‌కు ఎదురుగా అమర్చాడు

Published By: HashtagU Telugu Desk
Autodriver

Autodriver

ఒక్క ఐడియా (Idea) జీవితాన్నే మార్చేస్తుందని అంటుంటారు..తాజాగా ఓ ఆటో డ్రైవర్ (Auto Driver) చేసిన ఓ పని ఇప్పుడు ఆయన్ను సోషల్ మీడియా లో వైరల్ గా మార్చేసింది. ప్రస్తుతం ఎండాకాలం మొదలైంది. తొమ్మిది దాటినా తర్వాత బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఏ పని ఉన్న ఉదయం లేదా సాయంత్రమే చూసుకోవాలని భావిస్తున్నారు. కానీ అన్ని పనులు ఆలా సాగవు..దీంతో చేసేదేం లేక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇరాక్ ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్ చేసిన పనికి అంత ఫిదా అవుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎండల్లో తిరిగే ఆటో డ్రైవర్లు ఎండతో చాలా ఇబ్బంది పడుతుంటారు. వెనుక సీటులో కూర్చునే వారికి గాలి తగులుతుంది కానీ, ముందు కూర్చునే డ్రైవర్‌కు గాలి తగలదు. దాంతో తమిళనాడుకు చెందిన ఓ డ్రైవర్ ఆలోచించి ఓ పెద్ద పైపును (Pipe) తన ఆటోకు అమర్చాడు. ఆ పైపు ముందు భాగాన్ని బయటకు పెట్టి, చివరి భాగాన్ని తను కూర్చునే సీట్‌కు ఎదురుగా అమర్చాడు. ఆటో కదులుతున్నప్పుడు ఆ పైప్ గుండా బయటి గాలి లోపలికి వస్తుందని అతడి ప్లాన్. ఆ ప్లాన్ వర్క్ కావడం తో అతడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఈ వీడియోసోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను ఇప్పటివరకు 4 లక్షల మందికి పైగా లైక్ చేశారు.

Read Also : Domestic Cricketers: దేశవాళీ క్రికెట్ ఆడే క్రికెటర్ల జీతం పెంపు..? బీసీసీఐ నుంచి త్వ‌ర‌లోనే ఆమోదం..!

  Last Updated: 24 Mar 2024, 02:01 PM IST