పళని చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Pawan Kalyan : పళని చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Published By: HashtagU Telugu Desk
Pawankalyan And Akira Nanda

Pawankalyan And Akira Nanda

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా తమిళనాడులోని పళని (Palani) చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ పళని అరుల్మిగు దండాయుతపాణి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ తన కుమారుడు అకీరా నందన్‌(Akira Nandan)తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పురోహితుల నేతృత్వంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పవన్ ను చూసేందుకు భారీగా తరలివచ్చారు. పవన్ ఆలయ పరిసరాల్లో భక్తులతో కాసేపు ముచ్చటించారు.

Delhi New CM : ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు ..!

అంతకు ముందు పవన్ కళ్యాణ్ తిరుచెందూరు శ్రీ అరుల్మిగు సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకున్నారు. అక్కడ కూడా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పవన్ ఆలయంలో దైవదర్శనం అనంతరం భక్తులకు అభివాదం చేస్తూ ఆలయాన్ని వీడారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు తమిళనాడులో ఉన్న జనసేన, పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ సందర్శన సమయంలో పవన్‌కు ఘన స్వాగతం పలుకుతూ నినాదాలు చేశారు. పవన్ అందరితో స్నేహపూర్వకంగా పలకరించి అభిమానులను ఉత్సాహపరిచారు. తమిళనాడు పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్ త్వరలో తిరిగి ఏపీకి చేరుకోనున్నారు.

  Last Updated: 14 Feb 2025, 03:37 PM IST